Husband: రక్షించండి మహాప్రభో.. నా భార్య నన్ను రోజూ కొడుతోంది.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పుకున్నాడో భర్త.. చివరకు..!
ABN , First Publish Date - 2023-06-20T16:53:13+05:30 IST
ఈ నెల 17వ తేదీన జైపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది.. ``సార్.. నన్ను నా భార్య నుంచి కాపాడండి`` అంటూ ఓ వ్యక్తి ఏడుస్తూ వేడుకుంటున్నాడు.. ``ఆమె నన్ను రోజూ కొడుతోంది. పోలీస్‌స్టేషన్‌లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు`` అని చెప్పాడు. షాకైన కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే ఆ ఏరియా పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు.
ఈ నెల 17వ తేదీన జైపూర్ (Jaipur) పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది.. ``సార్.. నన్ను నా భార్య నుంచి కాపాడండి`` అంటూ ఓ వ్యక్తి ఏడుస్తూ వేడుకుంటున్నాడు.. ``ఆమె నన్ను రోజూ కొడుతోంది. పోలీస్‌స్టేషన్‌లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు`` అని చెప్పాడు. షాకైన కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే ఆ ఏరియా పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. భార్య తీరుతో బాధలు పడుతున్న భర్త ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ భార్య బాధితుడు మొర ఆలకించి కేసు నమోదు చేశారు (Wife Tortures Husband).
ఝోత్వారాకు చెందిన 48 ఏళ్ల విక్రమ్ అగర్వాల్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా తన భార్య చేతిలో ఇబ్బందులు పడుతున్నాడు. తనను, తన తల్లిదండ్రులను ప్రతిరోజూ తన భార్య మాటలతో హింసిస్తోందని, తనపై తరచుగా చేయి చేసుకుంటోందని విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను స్నానం చేసేటపుడు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితురాలైన మహిళ చేష్టలతో కుటుంబం మొత్తం ఆందోళనకు గురవుతోందని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విక్రమ్ డిమాండ్ చేశారు (Crime News).
Dogs Hostel: ఏసీ గదులు.. చికెన్‌తో ఆహారం.. రోజుకు 1200 అద్దె.. మనుషులకు కాదండోయ్.. శునకాల కోసం ప్రత్యేక హాస్టల్..!
విక్రమ్ భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి వివాహం జరిగి అత్తింట ఉంటోంది. కొడుకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. విక్రమ్ ఇప్పటికే ఝోత్వారా పోలీస్ స్టేషన్‌లో తన భార్యపై మూడు సార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తన భార్య మనోధైర్యం మరింత పెరిగిందని విక్రమ్ చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రమ్ భార్యను ప్రశ్నిస్తున్నారు.