రూ.10 వేలు ఇవ్వు.. నీ ప్రేయసితో ఇక అస్సలు మాట్లాడను.. ఇదీ ప్రియుడికి ఓ స్నేహితుడు పెట్టిన కండీషన్.. చివరకు..
ABN, First Publish Date - 2023-03-28T15:50:18+05:30
ఆ యువకుడు చాలా కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ ఆమ్మాయి కూడా అతడితో చనువుగానే ఉంటోంది.. ఇద్దరూ ప్రతిరోజూ మాట్లాడుకునేవారు.. వారి మధ్యకు మరో యువకుడు ప్రవేశించాడు..
ఆ యువకుడు చాలా కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు (Love Affair). ఆ ఆమ్మాయి కూడా అతడితో చనువుగానే ఉంటోంది.. ఇద్దరూ ప్రతిరోజూ మాట్లాడుకునేవారు.. నాలుగు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు కూడా ఆ అమ్మాయితో మాట్లాడ్డం మొదలుపెట్టాడు.. ఆ విషయం ఆ అమ్మాయి ప్రియుడికి తెలిసింది.. తన ప్రేయసితో మాట్లాడవద్దని ఆ యువకుడికి వార్నింగ్ (Warning) ఇచ్చాడు.. అయితే తనకు రూ.10 వేలు ఇస్తే ఆ అమ్మాయి జోలికి రానని ఆ యువకుడు చెప్పాడు.. చివరకు ఆ గొడవ పెద్దదై కత్తిపోటు వరకు వెళ్లింది (Crime News).
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని భోపాల్‌లో కమలానగర్ ప్రాంతానికి చెందిన శైలేంద్ర (21) అనే యువకుడు తన ప్రాంతంలోనే నివసించే ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగించేవాడు. ఆ అమ్మాయి కూడా శైలేంద్రతో బాగానే మాట్లాడేది. అయితే ఇటీవల ఆ అమ్మాయితో రాజా అనే యువకుడు కూడా మాట్లాడడం ప్రారంభించాడు. తన ప్రేయసితో రాజు మాట్లాడుతున్నట్టు శైలేంద్రకు తెలిసింది. రాజా దగ్గరకు వెళ్లి తన ప్రేయసితో మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చాడు. మార్చి 26న ఉదయం 11 గంటలకు శైలేంద్రను రాజా కలిశాడు.
నా భార్య పుట్టింటికి వెళ్లింది.. పార్టీ చేసుకుందాం రా.. అని ఫ్రెండును పిలిచాడో వ్యక్తి.. షాకింగ్ సీన్ చూసి పక్కింటి మహిళ కేకలు పెట్టడంతో..
ఆ అమ్మాయి జోలికి తను రాకూడదనుకుంటే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై శైలేంద్ర, రాజా మధ్య గొడవ మొదలైంది (Fight for Love). ఇద్దరూ కొట్టుకున్నారు. చివరకు రాజా తన జేబులో ఉన్న కత్తి తీసి శైలేంద్రను పొడిచి పారిపోయాడు. గాయపడిన శైలేంద్ర హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిపై ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Fridge Leaking Water: ఫ్రిడ్జ్‌లోంచి నీళ్లు బయటకు వస్తున్నాయా..? ఈ సింపుల్ స్టెప్స్‌తో లీకేజీ సమస్యకు చెక్ పెట్టండి..!
Updated Date - 2023-03-28T15:50:18+05:30 IST