Viral Video: బాబోయ్.. ఇతడి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. అనకొండ నీళ్లల్లోకి వెళ్లి దాక్కుంటున్నా..!
ABN, First Publish Date - 2023-11-21T22:37:15+05:30
ఉత్త చేతులతో భారి అనకొండను పట్టి బంధించిన వ్యక్తి వీడియో నెట్టింట్ల వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు ధైర్యవంతులు ప్రమాదాలకు ఎదురెళుతుంటారు. సాహసాలతో వచ్చే థ్రిల్ కోసం అర్రులు చాస్తారు. అలాంటి ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. కొద్ది రోజుల్లోనే ఏకంగా 11.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వీడియోలోని వ్యక్తి గుండె ధైర్యానికి జనాలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Viral Video: లోకల్ ట్రైన్‌లో ఫైవ్‌స్టార్ రెస్టారెంట్..విదేశాల్లో కాదండోయ్.. మన దగ్గరే..!
వీడియోలోని వ్యక్తి పేరు మైక్ హోల్స్‌స్టన్. అతడు ఫ్లోరిడాలోని(Florida) ఓ జూలో జంతు సంరక్షకుడిగా ఉద్యోగం చేస్తుంటాడు. తనని తాను అసలైన టార్జన్‌గా పిలుచుకుంటాడు. అందుకు తగ్గట్టే అతడు ప్రమాదకరమైన జంతువులను హ్యాండిల్ చేస్తుండగా తీసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇక ప్రస్తుత వీడియోలో అతడు ఓ భారీ అనకొండనే లొంగదీశాడు. నీళ్లల్లో దాక్కున్న దాన్ని ఉత్త చేతులతో పట్టి బంధించాడు(Man Catches Huge Anaconda With Bare Hands).
తొలుత అతడు నీళ్లల్లో దాగున్న పాము నోరు ఎక్కడ ఉందో తోక ఎక్కడ ఉందో జాగ్రత్తగా గమనించాడు. ఆ తరువాత మెల్లగా దాని తలను గట్టిగా పట్టి బయటకు లాగాడు. ఈ క్రమంలో ఆ అనకొండ అతడిని చుట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ, మైక్ మాత్రం ఒడుపుగా దానికి చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. అతడి నుంచి విడిపించుకునేందుకు చాలా సేపు ప్రయత్నించిన పాము చివరకు అలసిపోయింది. చివరిగా అతడు దాని తలపై ఓమారు చుంబించి ఆపై మెల్లగా దాన్ని పైకెత్తి సంచీలో పెట్టాడు. వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. ప్రపంచంలో ఇతడికి మించిన సాహసవంతుడు మరొకడు ఉండడని కామెంట్ చేశారు.
Updated Date - 2023-11-21T22:43:03+05:30 IST