Share News

Viral Video: లోకల్ ట్రైన్‌లో ఫైవ్‌స్టార్ రెస్టారెంట్..విదేశాల్లో కాదండోయ్.. మన దగ్గరే..!

ABN , First Publish Date - 2023-11-21T18:48:54+05:30 IST

ముంబై లోకల్ ట్రెయిన్‌లో ఇద్దరు యువకులు ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఓపెన్ చేసిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: లోకల్ ట్రైన్‌లో ఫైవ్‌స్టార్ రెస్టారెంట్..విదేశాల్లో కాదండోయ్.. మన దగ్గరే..!

ఇంటర్నెట్ డెస్క్: ఈ సోషల్ మీడియా యువతరానికి బుర్రనిండా ఐడియాలే! ఒక్కో ఐడియాను అమలు చేయడం.. నెట్టింట్లో వీడియోలతో సహా ఆ విశేషాలను పంచుకోవడం..క్షణాల్లో వైరల్ అయిపోవడం..ఇది ప్రస్తుతం యువత ఫాలో అవుతున్న ట్రెండ్. ఏ క్షణంలో ఎవరికి ఎలాంటి ఐడియా వచ్చి పాప్యులర్ అయిపోతారో చెప్పడం కష్టం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఇద్దరు యువకులు అలాంటి సంచలనాన్నే సృష్టించారు. ఏకంగా ముంబై లోకల్ ట్రెయిన్‌లోనే ఓ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ప్రారంభించి కలకలానికి తెరలేపారు(Youth opens five star restaurant in mumbai local train). వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

Homemade Washing Machine: వాషింగ్ మెషీన్ కొనడానికి డబ్బుల్లేక.. ఓ డ్రమ్ముతో ఎలా తయారు చేశాడో చూస్తే..!


అసలు..ఫైవ్ స్టార్ అన్న రేటింగ్‌కు అర్థం ఏంటి? అని అడిగితే అన్ని సౌకర్యాలు కల్పించడమే అని ఈ ఇద్దరు చెబుతున్నారు. ఈ ఫార్ములానే వారు ఆచరణలోపెట్టి రైల్లో ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఎలా అంటే ముందుగా వారు ముంబై స్టేషన్లన్నీ తిరుగుతూ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేయబోయేది చెబుతూ పాంప్లేట్లు పంచారు. ఆ రోజున అందరికీ ఉచితంగా ఆహారం సర్వే చేస్తామని కూడా చెప్పారు. వారిచ్చిన ప్రకటన చూసి తొలుత ఎవ్వరూ నమ్మలేదు.

Ind Vs Aus: ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే ఇంతే.. ఫైనల్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌పై నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రీదీ!

Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..


కానీ, ప్రారంభోత్సవం రోజున యువకులు అందరినీ ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేశారు. అన్ని ఆహార పదార్థాలు ఉన్న రెండు బ్యాగులు, ఓ చిన్న టేబుల్ తీసుకుని ఆ రోజున రైలు ఎక్కారు. అక్కడ కిటికీ వద్ద కనిపించిన కస్టమర్ల ముందు టేబుల్ వేసి, దానిపై ఓ తెల్లని వస్త్రం పరిచి ఫైవ్ స్టార్ హోటల్‌ స్థాయి రుచితో కూడిన ఆహారాన్ని సర్వ్ చేశారు. యువకులు సర్వ్ చేసిన ఫుడ్ అద్భుతంగా ఉండటంతో ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో, ఈ వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.

Dangerous animals: ఇవే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయ్.. ఆ ఒక్కదాని వల్ల ఏడాదికి 7 లక్షల మందికి పైనే..

Updated Date - 2023-11-21T18:49:03+05:30 IST