Mother Last Wish: నిజమైన కొడుకంటే మీరే బ్రదర్.. తల్లి ఆఖరి కోరికను తీర్చేందుకు స్ట్రెచర్‌పైనే వెయ్యి కిలోమీటర్లు తీసుకెళ్లి మరీ..
ABN, First Publish Date - 2023-03-21T17:05:28+05:30
అంధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి భుజాలపై మోసుకెళ్లే శ్రవణ కుమారుడిని ఉత్తమ పుత్రుడిగా వర్ణిస్తూ పురాణ కథల్లో చెబుతుంటారు. అదేవిధంగా గుజరాత్‌లోని కచ్‌లో నివసిస్తున్న ఓ యువకుడు తన తల్లి కోరికను తీర్చేందుకు ఎంతో శ్రమించాడు.
అంధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి భుజాలపై మోసుకెళ్లే శ్రవణ కుమారుడిని ఉత్తమ పుత్రుడిగా వర్ణిస్తూ పురాణ కథల్లో చెబుతుంటారు. అదేవిధంగా గుజరాత్‌లోని (Gujarat) కచ్‌లో నివసిస్తున్న ఓ యువకుడు తన తల్లి కోరికను (Mother Last Wish) తీర్చేందుకు ఎంతో శ్రమించాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను స్ట్రెచర్‌తో సహా తాజ్‌మహల్ (Taj Mahal) దగ్గరకు తీసుకెళ్లాడు. అతడి ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అతడి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).
గుజరాత్‌లోని ముంద్రా పట్టణంలో నివసిస్తున్న ఇబ్రహీం తల్లి రజియాకు తాజ్‌మహల్ చూడాలని ఎప్పట్నుంచో కోరిక. అయితే ఆమె 32 ఏళ్ల వయసు నుంచే వెన్ను సమస్యతో బాధపడుతోంది. వృద్ధాప్యానికి చేరువయ్యాక పూర్తిగా మంచానికే పరిమితమైంది. అయినా ఆమె తన కోరికను మాత్రం మర్చిపోలేదు. తల్లి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని ఇబ్రహీం అనుకున్నాడు. అందుకని తన తల్లి కోసం ప్రత్యేకంగా స్ట్రెచర్ తయారు చేయించాడు. అందులో ఆమెను పడుక్కోబెట్టి 1000 కి.మీ. ప్రయాణించి తాజ్‌మహల్ దగ్గరకు తీసుకెళ్లాడు.
Bride: పెళ్లిమండపంలోనే వరుడి ఫ్రెండ్ చేసిన తింగరి పని.. దెబ్బకు పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. అసలేం జరిగిందంటే..
సోమవారం తన తల్లితో కలిసి తాజ్‌మహల్ కాంప్లెక్స్‌కు చేరుకున్నాడు. స్ట్రెచర్‌పై పడుకుని రజియా తాజ్‌మహల్‌ని చూసింది. తాజ్‌ని చూసిన తర్వాత ఆమె ఎంతో సంతోషించింది. తన కొడుకు, కోడలుతో పాటు తాజ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అందించిన సహకారాన్ని ఆమె అభినందించారు. తల్లి కోరిక తీర్చేందుకు ఎంతో కష్టపడిన ఇబ్రహీంను అందరూ అభినందిస్తున్నారు.
Shocking: బాయ్‌ఫ్రెండ్ కోసం ఎంత పని చేసింది.. భర్తను, ముగ్గురు పిల్లలను చంపేసి రాత్రంతా వారి శవాల పక్కనే.. కోర్టు తీర్పు ఏంటంటే..
Updated Date - 2023-03-21T17:05:28+05:30 IST