Shocking: బాయ్‌ఫ్రెండ్ కోసం ఎంత పని చేసింది.. భర్తను, ముగ్గురు పిల్లలను చంపేసి రాత్రంతా వారి శవాల పక్కనే.. కోర్టు తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-21T14:25:40+05:30 IST

వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. ప్రియుడిని కలిసేందుకు అడ్డుగా ఉన్నారనే కారణంతో కట్టుకున్న భర్తను, కన్న కొడుకులను కిరాతకంగా చంపేసింది.

Shocking: బాయ్‌ఫ్రెండ్ కోసం ఎంత పని చేసింది.. భర్తను, ముగ్గురు పిల్లలను చంపేసి రాత్రంతా వారి శవాల పక్కనే.. కోర్టు తీర్పు ఏంటంటే..

వివాహేతర సంబంధం (Extra Marital Affarir) మోజులో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. ప్రియుడిని (Boy Friend) కలిసేందుకు అడ్డుగా ఉన్నారనే కారణంతో కట్టుకున్న భర్తను, కన్న కొడుకులను కిరాతకంగా చంపేసింది. అంతేకాదు రాత్రంతా వారి శవాల పక్కనే కూర్చుని గడిపింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ నేరంపై తాజాగా కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రియుడికి, ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన అప్పట్లో స్థానికంగా సంచలనంగా మారింది (Wife killed Husband).

రాజస్థాన్‌లోని (Rajasthan) అల్వార్‌కు చెందిన సంధ్యకు 1999లో బన్వారీ లాల్ శర్మతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. దాదాపు 15 సంవత్సరాల వరకు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోయింది. సంధ్యకు ముందు నుంచే థైక్వాండో తెలుసు. సంపాదన కోసం ఆమె థైక్వాండో కోచ్‌గా మారింది. ఆ సమయంలో ఆమెకు హనుమంతు అనే వ్యక్తితో పరిచయం జరిగింది. ఇద్దరూ థైక్వాండో పోటీలకు కలిసి వెళ్లేవారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇద్దరూ తరచుగా శారీరకంగా కలిసేవారు. సంధ్య కంటే హనుమంతు దాదాపు పదేళ్లు చిన్నవాడు.

Viral Video: అమెరికాలో ``నాటు.. నాటు`` ఫీవర్.. వైరల్ సాంగ్‌కు అనుగుణంగా టెస్లా కార్ల లైట్ షో!

సంధ్య చేష్టల గురించి తెలుసుకున్న భర్త, పెద్ద కొడుకు మోహిత్ ఆమెను నిలదీశారు. ఆమెను బయటకు వెళ్లకుండా ఆపేశారు. దీంతో సంధ్య, హనుమంతు కలవడం కుదరలేదు. దీంతో ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకుని భర్తను, పెద్ద కొడుకు మోహిత్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. 2017 ఆగస్టులో జంతువులను నరికే కత్తి గురించి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. అదే ఏడాది అక్టోబర్ 2వ తేదీ రాత్రి సంధ్య ఇంటికి హనుమంతు చేరుకున్నాడు. సంధ్య తన భర్తను, పెద్ద కొడుకును చంపాలనుకుంది. అయితే హనుమంతు మాత్రం మొత్తం కుటుంబ సభ్యులందరినీ చంపేశాడు. హత్యల అనంతరం అందరూ పారిపోయారు. చుట్టుపక్కల వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంధ్య, ఆమె ప్రియుడి హనుమంతు కోసం అన్వేషణ సాగించి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కేసు విచారించిన కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది.

Viral Video: పాపం.. ఆ బాయ్‌ఫ్రెండ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. ప్రేయసి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి..

Updated Date - 2023-03-21T14:25:40+05:30 IST