Viral Video: అమెరికాలో ``నాటు.. నాటు`` ఫీవర్.. వైరల్ సాంగ్‌కు అనుగుణంగా టెస్లా కార్ల లైట్ షో!
ABN , First Publish Date - 2023-03-21T11:18:09+05:30 IST
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగటైగర్ ఎన్టీయార్ (Jr NTR) హీరోలుగా రాజమౌళి రూపొందించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ``ఆర్ఆర్ఆర్`` (RRR).
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగటైగర్ ఎన్టీయార్ (Jr NTR) హీరోలుగా రాజమౌళి రూపొందించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ``ఆర్ఆర్ఆర్`` (RRR). ఈ సినిమాలోని ``నాటు నాటు`` (Naatu Naatu Song) పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ను (Oscar Awards) కూడా దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (Best Original Song category) కేటగిరీలో అవార్డు దక్కించుకున్న ఈ పాటపై సోషల్ మీడియా చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. గత రెండు నెలలుగా ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్‌లో (Trending Song) టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇతర దేశస్థులు కూడా ఈ పాటకు తమదైన శైలిలో చిందులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు (Elon Musk) చెందిన టెస్లా కార్ల సంస్థ కూడా ``నాటు.. నాటు..`` పాట పట్ల తన ప్రేమను ప్రదర్శించింది. ``నాటు.. నాటు..`` పాట బీట్‌కు అనుగుణంగా టెస్లా కార్లు (Tesla Cars) లైట్ షో చేశాయి. వరుసగా లైన్లో ఉన్న కార్లన్నీ పాటకు అనుగుణంగా తమ హెడ్‌లైట్లను డ్యాన్స్ వేయించాయి. పర్ఫెక్ట్ సింక్‌లో జరిగిన ఈ లైట్ షో అద్భుతంగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఐడియా చాలా మందికి నచ్చింది.
House For Rent: అద్దె ఇల్లు వెతుక్కుంటున్న ఓ బ్యాచిలర్‌కు షాకింగ్ అనుభవం.. ఇంటి ఓనర్లు ఈమధ్య ఇలాంటి వివరాలు కూడా అడుగుతున్నారా..?
``నాటు నాటు`` పాట సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను కూడా మెప్పించి ఆడిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు ఆ పాటకు చిందులేసి ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆస్కార్ వేదిక మీద కూడా ఈ పాటకు విదేశీ డ్యాన్సర్లు చిందులేసిన సంగతి తెలిసిందే.