Viral Video: పాపం.. ఆ బాయ్‌ఫ్రెండ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. ప్రేయసి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి..

ABN , First Publish Date - 2023-03-21T12:28:55+05:30 IST

ఆ యువకుడు ఇద్దరమ్మాయిలతో ఒకేసారి ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఒక్కొక్కరితో ఒక్కోసారి కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

Viral Video: పాపం.. ఆ బాయ్‌ఫ్రెండ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. ప్రేయసి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి..

ఆ యువకుడు ఇద్దరమ్మాయిలతో ఒకేసారి ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం (Love) సాగిస్తున్నాడు. ఒక్కొక్కరితో ఒక్కోసారి కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు (Cheating). అయితే అతడి ఆటలు ఎంతో కాలం సాగలేదు. తాజాగా ఒకమ్మాయితో ఉండగా మరో అమ్మాయికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు. అందరి ఎదుటూ ఆమె చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన స్టాల్‌లో ఒక అమ్మాయితో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. అక్కడికి వేగంగా ఓ బ్లాక్ కలర్ కారు వచ్చింది. ఆ వాహనంలోని ఒక అమ్మాయి, అబ్బాయి దిగారు. అమ్మాయి నేరుగా స్టాల్ దగ్గర అమ్మాయితో కూర్చున్న యువకుడిపై దాడికి దిగింది. వేగంగా వచ్చి ఆ యువకుడి పైకి కుర్చీ విసిరేసింది, సాస్ జల్లేసింది, అతడు తింటున్న ఆహార పదార్థాలను కిందకు తోసేసింది.

House For Rent: అద్దె ఇల్లు వెతుక్కుంటున్న ఓ బ్యాచిలర్‌కు షాకింగ్ అనుభవం.. ఇంటి ఓనర్లు ఈమధ్య ఇలాంటి వివరాలు కూడా అడుగుతున్నారా..?

ఆగ్రహంగా ఉగిపోతున్న ఆమెను అమెతో పాటు వచ్చిన యువకుడు అడ్డుకున్నాడు (Woman caught cheating boyfriend). ఆమెను కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 2.2 లక్షల మంది వీక్షించారు. పది వేల మంది లైక్ చేశారు. మోసం చేసిన ప్రియుడికి గట్టిగా బుద్ధి చెప్పిందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అమెరికాలో ``నాటు.. నాటు`` ఫీవర్.. వైరల్ సాంగ్‌కు అనుగుణంగా టెస్లా కార్ల లైట్ షో!

Updated Date - 2023-03-21T12:28:55+05:30 IST