Tiger Video: బావిలో పడిపోయిన చిరుత పులి.. కాపాడేందుకు మనిషి వెళ్తే ప్రాణాలు పోతాయని వెరైటీ ప్లాన్.. ఒకే ఒక్క చిన్న ట్రిక్‌తో..!
ABN, First Publish Date - 2023-06-23T18:40:53+05:30
ఇటీవలి కాలంలో వన్య ప్రాణులు రకరకాల కారణాలతో జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఆహార అన్వేషణలో భాగంగా అటవీ సమీప గ్రామాల్లోకి వస్తున్న వన్య జీవులు మనుషులకు ప్రమాదాలు కలిగిస్తున్నాయి. చాలా సార్లు అవే ప్రమాదాల్లో పడుతున్నాయి.
ఇటీవలి కాలంలో వన్య ప్రాణులు (Wild Animals) రకరకాల కారణాలతో జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఆహార అన్వేషణలో భాగంగా అటవీ సమీప గ్రామాల్లోకి వస్తున్న వన్య జీవులు మనుషులకు ప్రమాదాలు కలిగిస్తున్నాయి. చాలా సార్లు అవే ప్రమాదాల్లో పడుతున్నాయి. తాజాగా ఓ చిరుత పులి (Leopard) అడవి నుంచి సమీప గ్రామంలోకి వచ్చి ఓ బావిలో పడిపోయింది. ఆ చిరుతను బయటకు తీసేందుకు అటవీ సిబ్బంది ఆపసోపాలు పడ్డారు. చివరకు ఓ అద్భుతమైన ట్రిక్‌తో చిరుతను కాపాడారు (Leopard fell in the well).
కర్ణాటక (Karnataka)లోని ఓ గ్రామంలో అడవి నుంచి వచ్చిన ఒక చిరుతపులి బావిలో పడిపోయింది. స్థానికులు గమనించి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది చిరుత బయటకు వచ్చేందుకు వీలుగా బావిలో ఓ నిచ్చెనను అమర్చారు. అయితే ఆ నిచ్చెనను, రెస్క్యూ సిబ్బందిని చూసి చిరుత కంగారుపడింది. బయటకు రావడానికి భయపడింది. దీంతో సిబ్బంది ఓ అద్భుతమైన ప్లాన్ వేశారు. ఒక కర్రకు నిప్పంటించి (Fire) బావిలో ఉన్న చిరుత దగ్గరికి తీసుకెళ్లి భయపట్టారు.
Viral Video: కుర్రాళ్లూ.. జర జాగ్రత్త.. బైక్‌పై వెళ్తూ ఇలాంటి వెర్రి చేష్టల్ని మీరూ చేస్తున్నారా..? ఈ యువకులకు జరిగింది చూస్తే..!
మంటను చూసి భయపడిన చిరుత నిచ్చెన ఎక్కి బావిలో నుంచి బయటకు వచ్చి అడవి వైపు పరుగెత్తింది. దీంతో అటవీ సిబ్బంది, చుట్టు పక్కల ఉన్న వారు చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. @singhsahana అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Leopard Videos) మారింది. ఇప్పటివరకు 92 వేల మంది ఈ వీడియోను వీక్షించారు.
Updated Date - 2023-06-23T18:41:10+05:30 IST