Viral Video: కుర్రాళ్లూ.. జర జాగ్రత్త.. బైక్‌పై వెళ్తూ ఇలాంటి వెర్రి చేష్టల్ని మీరూ చేస్తున్నారా..? ఈ యువకులకు జరిగింది చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-23T18:23:47+05:30 IST

సరదా కోసమో, వీడియోల కోసమే యువత రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తుంటారు. బిజీగా ఉన్న రోడ్లుపై కూడా బైక్‌లతో సాహసాలకు దిగుతారు. ప్రాణాంతక విన్యాసాలు చేసి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ విన్యాసాలు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోతుంటారు.

Viral Video: కుర్రాళ్లూ.. జర జాగ్రత్త.. బైక్‌పై వెళ్తూ ఇలాంటి వెర్రి చేష్టల్ని మీరూ చేస్తున్నారా..? ఈ యువకులకు జరిగింది చూస్తే..!

సరదా కోసమో, వీడియోల కోసమే యువత రోడ్లపై బైక్ విన్యాసాలు (Bike Stunts) చేస్తుంటారు. బిజీగా ఉన్న రోడ్లుపై కూడా బైక్‌లతో సాహసాలకు దిగుతారు. ప్రాణాంతక విన్యాసాలు చేసి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ విన్యాసాలు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోతుంటారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కుర్రాళ్లు మాత్రం తమ ధోరణి మార్చుకోవడం లేదు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది (Bike Stunt Videos).

తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లో ఇద్దరు యువకులు బిజీగా ఉన్న రోడ్డుపై స్పోర్ట్స్ బైక్‌తో స్టంట్ చేశారు. viral_bulletin అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు అమిత వేగంతో బైక్‌పై వెళ్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను తప్పించుకుంటూ ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. ఇంతలో అదుపు తప్పి బైక్ రోడ్డుపై పడిపోయింది (Road Accident Videos). ఆ ధాటికి బైక్ రోడ్డుపై పడినపుడు నిప్పు రవ్వలు కూడా వచ్చాయి. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆ కుర్రాళ్లు గాయాలతో బయటపడ్డారు.

Overnight Millionaire: పొద్దున్నే ఫోన్లో మెసేజ్‌ చూసి షాక్.. వెంటనే ఏటీఎంకు వెళ్లి చెక్ చేస్తే మైండ్‌బ్లాక్.. అకౌంట్లోకి ఏకంగా రూ.18 లక్షలు..!

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఇప్పటివరకు 72 వేలకు పైగా లైక్‌లు దక్కించుకుంది. ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ``ఇలాంటి వారిపై జాలి చూపకూడదు``, ``దయచేసి ఆ కుర్రాళ్లు లైసెన్స్‌లను రద్దు చేయండి``, ``వాళ్లకి వాళ్ల ప్రాణాలపై తీపి లేదు. కానీ, ఇతరుల ప్రాణాలను ఎందుకు రిస్క్‌లో పెడుతున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-23T18:23:47+05:30 IST