Overnight Millionaire: పొద్దున్నే ఫోన్లో మెసేజ్‌ చూసి షాక్.. వెంటనే ఏటీఎంకు వెళ్లి చెక్ చేస్తే మైండ్‌బ్లాక్.. అకౌంట్లోకి ఏకంగా రూ.18 లక్షలు..!

ABN , First Publish Date - 2023-06-23T16:35:10+05:30 IST

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడిని ఉన్నట్టుండి ఆదృష్టం వరించింది. హనుమాన్‌గఢ్‌కు చెందిన దినేష్ అనే యువకుడి మొబైల్‌కు కొద్దిరోజుల క్రితం ఓ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చదివి షాకయ్యాడు.

Overnight Millionaire: పొద్దున్నే ఫోన్లో మెసేజ్‌ చూసి షాక్.. వెంటనే ఏటీఎంకు వెళ్లి చెక్ చేస్తే మైండ్‌బ్లాక్.. అకౌంట్లోకి ఏకంగా రూ.18 లక్షలు..!

రాజస్థాన్‌ (Rajasthan)లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడిని ఉన్నట్టుండి ఆదృష్టం వరించింది. హనుమాన్‌గఢ్‌కు చెందిన దినేష్ అనే యువకుడి మొబైల్‌కు కొద్దిరోజుల క్రితం ఓ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చదివి షాకయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబంలోని ఎవరికీ చెప్పలేదు. నేరుగా ఏటీఎం (ATM)కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా అతడి ఖాతాలో రూ.18 లక్షలు పడినట్టు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిన దినేష్ డబ్బు ఖర్చు చేయడం కూడా ప్రారంభించాడు.

డబ్బు మొత్తం ఖర్చయ్యాక బ్యాంకర్లు అతడికి ఫోన్ చేశారు. ఈ డబ్బు అతనికి పొరపాటున వచ్చిందని తేలిపారు. ఆ డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో దినేష్ షాకయ్యాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. బ్యాంకు అధికారులు ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని భుంగ్రా గ్రామంలో గతేడాది జరిగిన గ్యాస్ సిలెండర్ల పేలుడు ప్రమాదంలో 30 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 18 లక్షల 60 రూపాయలను విడుదల చేసింది.

Viral News: అదృష్టమంటే ఈ యువతిదే.. నెలకు ఏకంగా రూ.4.80 లక్షల జీతం.. ఇంతకీ ఈమె చేసే పనేంటంటే..

బ్యాంకు సిబ్బంది అకౌంట్ నెంబర్‌లో ఓ అంకెను తప్పుగా నమోదు చేయడంతో ఆ డబ్బులు హనుమాన్‌గఢ్‌లో నివసిస్తున్న దినేష్ అనే యువకుడి ఖాతాలోకి వెళ్లాయి. ఆ డబ్బులను వెంటనే దినేష్ వాడేసుకున్నాడు. తన తండ్రి హాస్పిటల్ ఖర్చుల కోసం కొంత వాడేశాడు. మిగిలన మొత్తాన్ని తన ఖర్చుల కోసం ఉపయోగించుకున్నాడు. బ్యాంకు నుంచి కాల్ వచ్చి అసలు విషయం తెలియడంతో షాకయ్యాడు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వడానికి దినేష్ అంగీకరించాడు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-06-23T16:35:10+05:30 IST