Viral News: అదృష్టమంటే ఈ యువతిదే.. నెలకు ఏకంగా రూ.4.80 లక్షల జీతం.. ఇంతకీ ఈమె చేసే పనేంటంటే..
ABN , First Publish Date - 2023-06-23T16:16:25+05:30 IST
ఉద్యోగ జీవితం అంటే ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. నెలవారీ సంపాదన కోసం ఎవరైనా శారీరకంగా లేదా మానసికంగా కష్టపడాల్సిందే. అయితే కేవలం కొద్ది మందికి మాత్రమే అత్యంత విలాసవంతమైన ఉద్యోగాలు దొరుకుతాయి. అదృష్టవంతులకే మాత్రమే అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
ఉద్యోగ జీవితం అంటే ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. నెలవారీ సంపాదన కోసం ఎవరైనా శారీరకంగా లేదా మానసికంగా కష్టపడాల్సిందే. అయితే కేవలం కొద్ది మందికి మాత్రమే అత్యంత విలాసవంతమైన ఉద్యోగాలు (Jobs) దొరుకుతాయి. అదృష్టవంతులకే మాత్రమే అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అమెరికా (America)కు చెందిన ఓ యువతికి అలాంటి అదృష్టమే పట్టింది. ఆ మహిళ ప్రతిరోజూ విలాసవంతమైన ఇళ్లలో కూర్చుని గంటకు రూ.2000 సంపాదిస్తుంటుంది.
ఇంతకీ అమె చేసే ఉద్యోగం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అమెరికాలోని న్యూయార్క్ (New York) నగరానికి చెందిన కలేహ్ డెనిస్ అనే యువతి విలాసవంతమైన ఇళ్లలో కూర్చొని గంటకు రూ.2,000 వరకు సంపాదిస్తుంది. ఆమె న్యూయార్క్‌లో బేబీ సిట్టర్. తల్లిదండ్రులు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు, కాలియా వారి పిల్లలను సంరక్షిస్తుంటంది. అలాగని ఆమెకు పెద్దగా పనేం ఉండదు. తల్లిదండ్రులు బయటకు వెళ్లినపుడు వారి పిల్లలతో కలిసి ఇంట్లో ఉండడం, వారితో కలిసి టీవీ చూడడం, ఆడుకోవడం వంటివి మాత్రమే చేస్తుంది (Luxurious Job).
Viral Video: ముసలోడే కానీ.. మహానుభావుడు.. ఓ కర్రను తలపై పెట్టుకుని గిరా గిరా తిప్పుతూనే ఉన్నాడు..!
పిల్లలు ప్రమాదకర పనులు చేయకుండా పర్యవేక్షించడం మాత్రమే ఆమె పని. కేవలం ఆ పని చేసినందుకే ఆమె గంటకు రూ.2 వేలు సంపాదిస్తోంది. న్యూయార్క్‌లోని ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కాలియా పని చేస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు తాను ఉదయం 7 గంటలకు పనికి వెళ్లి సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తానని కాలియా తెలిపింది. తనది చాలా విలాసవంతమైన ఉద్యోగం అని, ఇలాంటి ఉద్యోగం న్యూయార్క్‌లో చేస్తేనే బాగుంటుందని కాలియా పేర్కొంది.