Viral Video: ముసలోడే కానీ.. మహానుభావుడు.. ఓ కర్రను తలపై పెట్టుకుని గిరా గిరా తిప్పుతూనే ఉన్నాడు..!
ABN , First Publish Date - 2023-06-23T15:42:16+05:30 IST
కొంత మందికి వయసు అనేది కేవలం ఓ నెంబర్ మాత్రమే. వయసు మీరుతున్నా కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. యువకులను మించిన ఉత్సాహంగా కనిపిస్తారు. అలాంటి వృద్ధులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొంత మందికి వయసు అనేది కేవలం ఓ నెంబర్ మాత్రమే. వయసు మీరుతున్నా కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. యువకులను మించిన ఉత్సాహంగా కనిపిస్తారు. అలాంటి వృద్ధులకు (Old Man Videos) సంబంధించిన ఆసక్తికర వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. హర్యానా (Haryana)కు చెందిన ఓ తాత కర్రను తలపై పెట్టుకుని తిప్పుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకర్షించింది (Viral Video).
Haryana_Hood అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఓ ముసలాయన నిలబడి ఉన్నాడు. అతడు తన గుండుపై ఓ కర్ర (Stick)ను ఉంచి దానిని తిప్పుతున్నాడు. కర్రను పట్టుకోకుండా తలను తిప్పుతూ కర్రను తిరిగేలా చేస్తున్నాడు. ఆ కర్ర కింద పడిపోకుండా హెలికాఫ్టర్ (Helicopter) రెక్కల్లా గుండ్రంగా అతడి తలపై తిరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడి ప్రతిభను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Viral Video: కొడుకుతో కలిపి బైక్‌పై వెళ్తుండా సడన్‌గా వర్షం స్టార్ట్.. ఆ తల్లి చేసిన పనేంటో చూసి నెటిజన్లు ఫిదా..!
ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై జనాలు చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ``డోరేమ్యాన్ దాదా``, హర్యానా హెలికాఫ్టర్``, ``తాతగారి ప్రతిభ అమోఘం`` అంటూ కామెంట్ల ద్వారా ప్రశంసిస్తున్నారు.