Viral Video: కొడుకుతో కలిపి బైక్‌పై వెళ్తుండా సడన్‌గా వర్షం స్టార్ట్.. ఆ తల్లి చేసిన పనేంటో చూసి నెటిజన్లు ఫిదా..!
ABN , First Publish Date - 2023-06-23T15:22:53+05:30 IST
ఈ ప్రపంచంలో ఓ తల్లికి తన బిడ్డల పట్ల ఉండే అనుబంధం మరే ఇతర బంధాల్లోనూ ఉండదు. మనషుల్లోనైనా, ఇతర జంతువుల్లోనైనా తన బిడ్డల గురించి తల్లి పడే తపన చాలా గొప్పగా ఉంటుంది. పిల్లలకు కష్టం వస్తే తల్లి తల్లడిల్లిపోతుంది. తన ప్రాణం పణంగా పెట్టైనా సరే బిడ్డలను కాపాడుకుంటుంది.
ఈ ప్రపంచంలో ఓ తల్లి (Mother)కి తన బిడ్డల పట్ల ఉండే అనుబంధం మరే ఇతర బంధాల్లోనూ ఉండదు. మనషుల్లోనైనా, ఇతర జంతువుల్లోనైనా తన బిడ్డల గురించి తల్లి పడే తపన చాలా గొప్పగా ఉంటుంది. పిల్లలకు కష్టం వస్తే తల్లి తల్లడిల్లిపోతుంది. తన ప్రాణం పణంగా పెట్టైనా సరే బిడ్డలను కాపాడుకుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నారు (Emotional Video). పిల్లలు ఎంత పెద్దవారైనా వారి క్షేమం కోసం తల్లి పడే తపన ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ తల్లి, కొడుకు రాత్రి సమయంలో బైక్‌పై వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఆ సమయంలో చినుకులు (Rain) పడుతున్నాయి. దాంతో బైక్ వెనుక కూర్చున్న తల్లి.. కొడుకు (Son) తడవకుండా తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను అతడి తలపై పెట్టింది. ఆమె మాత్రం వర్షంలో తడిసిపోతోంది. తను తడిసి పోయినా కొడుకును తడవనివ్వకూడదని ఆ తల్లి ప్రయత్నిస్తోంది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Viral Video).
Viral: వద్దని వేడుకున్నా సరే.. 11 ఏళ్ల వయసుకే ఇతడికి పెళ్లి చేసిన తండ్రి.. ప్రస్తుతం ఈ కుర్రాడు వార్తల్లో వ్యక్తిగా నిలవడం వెనుక..!
@SuhanRaza4 అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా వీక్షించారు. ``తల్లి అందరి పాత్రలను పోషించగలదు. కానీ తల్లి పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు`` అని కామెంట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``తల్లి తప్ప మరొకరు ఇలా ఆలోచించలేరు``, ``తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేయగలదు`` అని కామెంట్లు చేశారు.