ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుడు చెప్పేశాడు.. నాకీ పెళ్లి వద్దు.. విడాకులు ఇప్పించండంటూ కోర్టు మెట్లెక్కిన ఓ భర్త.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-02-03T13:21:08+05:30

విడాకులు ఇప్పుడిదొక ట్రెండ్ అయిపోయింది. విడిపోయేవాళ్లు చెప్పే రీజన్స్ వింటుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఫ్యామిలీ కోర్టు (Family Court)లో ఎన్నో కేసులు చూసిన జడ్జి కూడా ఓ జంట చెప్పిన కారణం విని షాకయ్యాడు. ఆయనే కాదు ఈ సంగతి తెలిస్తే మనం కూడా షాకవుతాం. జోక్ కాదు. ఇది నిజం. ఇంతకీ ఏమైందనే కదా? మీ డౌట్. విషయం తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

నాకీ పెళ్లి వద్దు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడాకులు ఇప్పుడిదొక ట్రెండ్ అయిపోయింది. విడిపోయేవాళ్లు చెప్పే రీజన్స్ వింటుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఫ్యామిలీ కోర్టు (Family Court)లో ఎన్నో కేసులు చూసిన జడ్జి కూడా ఓ జంట చెప్పిన కారణం విని షాకయ్యాడు. ఆయనే కాదు ఈ సంగతి తెలిస్తే మనం కూడా షాకవుతాం. జోక్ కాదు. ఇది నిజం. ఇంతకీ ఏమైందనే కదా? మీ డౌట్. విషయం తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. ఎందుకంటే పెళ్లైన దంపతులు కలకాలం.. నిండు నూరేళ్లు వర్ధిల్లి పిల్లాపాపలతో జీవించాలని ఆశీర్వదిస్తారు. ఇది మన పూర్వికుల నుంచి వస్తున్న సాంప్రదాయం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాకెట్ యుగంలో దూసుకుపోతున్న నేటి తరం. వైవాహిక బాంధవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంత మంది ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకుల (Divorce) కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు కేసులన్నీ ఇవ్వేరావడంతో న్యాయ నిపుణులు (Legal experts) తలలు పట్టుకుంటున్నారు.

సహజంగా వివాహేతర సంబంధం వల్లనో.. లేదంటే ఆస్తి తగాదాలతోనో.. లైంగిక బంధం సరిగ్గా లేకపోవడం వల్లనో.. ఇంకా లేదంటే వరకట్న వేధింపులు వల్లనో విడాకులు తీసుకున్న సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. టీవీ షో (TV show)ల్లో కూడా ప్రత్యక్షంగా చూస్తూ వింటుంటాం. కానీ కర్ణాటక (Karnataka)లో ఓ దంపతులు విడిపోవడానికి చెప్పిన కారణం తెలిసి జడ్జే (Judge) అవాక్కయ్యాడు.

ఇది కూడా చదవండి: కడుపు నొప్పిగా ఉందంటూ ఏడుస్తున్న కూతురు.. ఆస్పత్రిలో డాక్టర్లు చెప్పింది విని నివ్వెరపోయిన తల్లి.. ఆమె నిర్ణయంతో..

సజావుగా సాగుతున్న కాపురంలో దేవుడి పేరు చెప్పి చిచ్చు రేపాడు ఓ ప్రబుద్ధుడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హందనకెరె గ్రామానికి చెందిన మంజునాథ్‌.. విడాకులు తీసుకోవాలని తనకు దేవుడు చెప్పాడంటూ పిటిషన్ వేశాడు. ప్రేమ (love)గా ఉంటున్న భార్యను వదిలిపెట్టేందుకు రెడీ అయ్యాడు. కేసు విచారణకు రాగా... విచిత్రమైన కారణం విని న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు.

హందనకెరె గ్రామానికి చెందిన మంజునాథ్‌, పార్వతమ్మలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది (marriage). వారిద్దరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే దేవుడి మాట విని భర్త మంజునాథ్ మూఢనమ్మకంతో భార్యకు విడాకులు ఇవ్వాలని కోర్టుకెళ్లాడు. చిక్కనాయకనహళ్లి కోర్టులో విడాకుల (divorce) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాంటి గొడవలు లేకపోయినా దేవుడి మాటకు భయపడాలన్న ఉద్దేశంతోనే విడాకుల కోసం దరఖాస్తుకున్నట్టు మంజునాథ్ వివరించాడు. ఈ మేరకు తనకు పతిరయ్య అనే వ్యక్తి సలహా ఇచ్చినట్టుగా వెల్లడించాడు. పిటిషనర్ వాదన విన్న జడ్జి.. దంపతులిద్దరికీ అక్కడనే కౌన్సెలింగ్ ఇచ్చి భార్యాభర్తల బంధం గురించి వివరించారు. దీంతో న్యాయమూర్తి మాటలు విన్న మంజునాథ్.. భార్యతో కలిసి ఉండేందుకు అంగీకరించాడు. అనంతరం దంపతులిద్దరూ కోర్టు ఆవరణలో దండలు మార్చుకున్నారు. హాయిగా జీవించాలని కోర్టు సిబ్బంది దీవించి పంపించారు.

ఇది కూడా చదవండి: వింత సంఘటన.. పరీక్షా కేంద్రంలోనే స్పృహ తప్పి పడిపోయిన ఇంటర్ విద్యార్థి.. అమ్మాయిలే అసలు కారణమట..

Updated Date - 2023-02-03T15:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising