ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JeevithaRajasekhar: వచ్చే ఎన్నికల్లో జీవిత పోటీ చేయడం ఖాయం

ABN, First Publish Date - 2023-02-06T16:28:26+05:30

తెలంగాణ నుండి చిత్ర పరిశ్రమ తరపున పోటీ చేసే వారిలో జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ముందున్నారు. జీవిత బీజేపీ పార్టీ నుండి పోటీ ఖాయం అని కూడా తెల్సింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రానున్న ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా (Coming elections) ఆసక్తికరంగా సాగే అవకాశాలు వున్నాయి. కారణం ఏంటి అంటే, ఈసారి చిత్రపరిశ్రమ (Telugu Film Industry) నుండి కొంతమంది రెండు రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం వుంది. పార్టీలు కూడా పరిశ్రమ నుండి ఎవరు వచ్చినా ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా కూడా వున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుండి చిత్ర పరిశ్రమ తరపున పోటీ చేసే వారిలో జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ముందున్నారు. జీవిత బీజేపీ పార్టీ నుండి పోటీ ఖాయం అని కూడా తెల్సింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి ఎన్నికల సమయంలో ప్రచారం మాత్రమే చేసిన జీవిత ఈసారి బీజేపీ నుండి సీటు కచ్చితంగా వచ్చేట్టు చేసుకున్నారు.

ఈమధ్య జరిగిన మునుగోడు (Munugode) ఉప ఎన్నికల్లో (By-election) బీజేపీ తరపున జీవిత చాలా గట్టిగా ప్రచారం చేసారు. ఆ తరువాత బీజేపీ తెలంగాణ (#BJPTelangana) అధ్యక్షుడు, అలాగే ఈటెల రాజేందర్ (Etela Rajender) నాయకత్వం లో జీవిత తరచూ బీజేపీ నాయకులను కలుస్తూ వున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకి రానున్న ఎన్నికల్లో సీటు ఖాయం చేసారని కూడా తెలిసింది. ఆమె మీద బీజేపీ నాయకత్వం చాల నమ్మకంగా ఉండబట్టే, ఆమెకి ప్రస్తుతం వికారాబాద్ నియోజక (Vikarabad Constituency) వర్గ బాధ్యతలను బీజేపీ నాయకత్వం అప్పగించింది తెలిసింది. రానున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోందని అందులో భాగంగానే జీవిత రాజశేఖర్ ని వికారాబాద్ నియోజకవర్గానికి ఇంచార్జి గా నియమించారని తెలిసింది.

జీవిత ఇందులో భాగంగా ఆ నియోజకవర్గానికి చాలా సార్లు వెళ్లి అక్కడ లోకల్ నాయకులను కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీకిస్తున్నారని కూడా తెలిసింది. అలాగే అక్కడి నాయకులూ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా జీవిత ని కలుస్తున్నారని, మొత్తానికి జీవిత కి రానున్న ఎన్నికల్లో సీటీ ఖాయం అని తెలిసింది. అయితే ఆమె ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయం మీద రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలిసింది. అందుకే జీవిత బీజేపీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆమె పోటీ చేసే నియోజకవర్గం చెపితే, ఇప్పటి నుండే అక్కడ లోకల్ నాయకులతో కలిసి విజయం కోసం పనిచేయవచు అని ఆమె అనుకుంటోంది.

Updated Date - 2023-02-06T16:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising