Viral News: ఈ సింపుల్ ప్రశ్నకు పది సెకన్లలో సమాధానం కనుక చెప్తే.. మీరు నిజంగా తెలివైన వాళ్లే..!
ABN, First Publish Date - 2023-06-28T16:19:15+05:30
మీరు మ్యాథ్స్ పజిల్స్ చేయడాన్ని బాగా ఇష్టపడతారా? లేదా పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారా? మీకు గణితంలో మంచి పట్టు ఉందని అనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ పజిల్‌ను పది సెకెన్లలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
మీరు మ్యాథ్స్ పజిల్స్ (Mathematics puzzle) చేయడాన్ని బాగా ఇష్టపడతారా? లేదా పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారా? మీకు గణితంలో మంచి పట్టు ఉందని అనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ పజిల్‌ను పది సెకెన్లలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. puzzles అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ పజిల్‌ను షేర్ చేశారు. చాలా మంది ఈ పజిల్‌కు సరైన సమాధానాన్ని (Guess the Answer) ఊహించి పంపించారు.
ఈ పజిల్‌లో ``5 + 3 = 28, 9 + 1 = 810, 8 + 6 = 214, 5 + 4 = 19 అయితే, 7 + 3=?`` ఎంత అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలన్నింటిలోనూ రీజనింగ్ (Reasoning) సబ్జెక్ట్‌కు సంబంధించి ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. పైన పేర్కొన్న పజిల్‌ను చాలా తక్కువ సమయంలో మీరు కనుక పూర్తి చేసినట్టైతే మీ ప్రిపరేషన్ బాగానే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఈ ప్రశ్నకు ``410`` అని సరైన సమాధానమే చెప్పారు.
Viral News: బోర్ కొడుతోందని విమానంలోనే హెన్నా పెట్టుకున్న యువతి.. ఇలా నిలదీస్తారని కలలో కూడా ఊహించి ఉండదు..!
ఈ పజిల్‌లో ముందుగా రెండు అంకెల మధ్య ఉన్న తేడాను, తర్వాత రెండు అంకెలను కలిపితే వచ్చే సంఖ్యను పక్కపక్కనే రాస్తే సమాధానం వచ్చేస్తుంది. ఇలాంటి చాలా పజిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని పూర్తి చేసేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
Updated Date - 2023-06-28T16:19:15+05:30 IST