Viral News: బోర్ కొడుతోందని విమానంలోనే హెన్నా పెట్టుకున్న యువతి.. ఇలా నిలదీస్తారని కలలో కూడా ఊహించి ఉండదు..!
ABN , First Publish Date - 2023-06-28T16:05:35+05:30 IST
విమానంలో చాలా గంటలు కూర్చుని సుదీర్ఘంగా ప్రయాణించడం చాలా బోరింగ్‌గా ఉంటుంది. కాకపోతే విమానంలో టైమ్ పాస్ కోసం సినిమాలు చూడవచ్చు, పుస్తకం చదవవచ్చు లేదా పాటలు వినవచ్చు. కొంత సమయం తర్వాత అలసిపోయినట్టు అనిపించే వీలుంది. అప్పుడు ఏమి చేయగలరో ఊహించండి?
విమానంలో చాలా గంటలు కూర్చుని సుదీర్ఘంగా ప్రయాణించడం (Flight Journey) చాలా బోరింగ్‌గా ఉంటుంది. కాకపోతే విమానంలో టైమ్ పాస్ కోసం సినిమాలు చూడవచ్చు, పుస్తకం చదవవచ్చు లేదా పాటలు వినవచ్చు. కొంత సమయం తర్వాత అలసిపోయినట్టు అనిపించే వీలుంది. అప్పుడు ఏమి చేయగలరో ఊహించండి? తాజాగా ఓ మహిళ లాంగ్ జర్నీతో బోర్ ఫీలై విమానంలోనే తన చేతులకు మెహందీ (Mehendi) వేసుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై నెటిజన్లు కాస్త వెరైటీగా రియాక్ట్ అయ్యారు.
@miss__bliss అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఒక మహిళ విమాన ప్రయాణంతో బోర్ ఫీలై చేతులకు గోరింటాకు పెట్టుకుంటోంది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోను దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు. ఆ మహిళపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``హెన్నా వాసనతో ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించాలని ఎందుకు అనిపించింది`` అని ఒకరు ప్రశ్నించారు.
Viral Video: గూటిలో ఉన్న పిల్లల్ని తినేందుకు పాము ఎంట్రీ.. తోక పట్టుకుని కిందకు లాగేసిన తల్లి పక్షి.. చివరకు జరిగింది చూస్తే..!
``హెన్నా వాసన చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. అది చాలా మందికి పడదు. వారు ఇబ్బంది పడతారు`` అని మరొకరు కామెంట్ చేశారు. ``భవిష్యత్తులో ఎప్పుడైనా విమానంలో మీ పక్కన కూర్చునే అవకాశం వస్తే బాగుణ్ను``, ``మంచి ఐడియా`` అంటూ కామెంట్లు చేశారు.