Viral Video: గూటిలో ఉన్న పిల్లల్ని తినేందుకు పాము ఎంట్రీ.. తోక పట్టుకుని కిందకు లాగేసిన తల్లి పక్షి.. చివరకు జరిగింది చూస్తే..!
ABN , First Publish Date - 2023-06-28T15:48:16+05:30 IST
బిడ్డను తల్లిని మించి ఎవరూ ప్రేమించలేరు. పిల్లలకు ఏ కష్టం వచ్చినా తల్లి అండగా నిలుస్తుంది, పిల్లల సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా తల్లీబిడ్డల బంధానికి మించినది మరొకటి లేదు.
బిడ్డను తల్లి(Mother)ని మించి ఎవరూ ప్రేమించలేరు. పిల్లలకు ఏ కష్టం వచ్చినా తల్లి అండగా నిలుస్తుంది. పిల్లల సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా తల్లీబిడ్డల బంధానికి మించినది మరొకటి లేదు. బిడ్డకు ఆపద వస్తే ప్రాణాలకు తెగించి పోరాడేందుకు తల్లి ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
@animals5s అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పాము (Snake) చెట్టు(Tree) పై ఓ పక్షి (Bird) పెట్టుకున్న గూడులోకి ప్రవేశించి లోపల ఉన్న గుడ్లను తినడానికి ప్రయత్నించింది. తన పిల్లలను కాపాడుకునేందుకు తల్లి పక్షి ఎంతగానో తపన పడింది. తన బలాన్ని అంతా ఉపయోగించి ఆ పాము తోకను పట్టుకుని బయటకు లాగేసింది. దీంతో పాము, పక్షి చెట్టు పై నుంచి కిందకు పడిపోయాయి. కిందకు పడిన తర్వాత పక్షిని ఆ పాము బలంగా చుట్టేసింది. దీంతో ఆ పక్షి ఊపిరాడక చనిపోయింది (Bird fought with Snake).
Ice Cream making Video: ఇది ఐస్‌క్రీమా..? లేక ఆయిల్ క్రీమా..? ఐస్‌క్రీమ్ తయారీకి ఏ రేంజ్‌లో నూనె వాడుతున్నారో చూస్తే..!
పిల్లలను రక్షించుకునేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టిన పక్షికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 11 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు. ``ఈ ప్రపంచంలో తల్లిలా ఉండడం మరెవరకీ సాధ్యం కాదు``, ``ముగింపు చాలా బాధాకరంగా ఉంది``, ``పిల్లలను రక్షించుకునేందుకు తల్లి ఎవరితోనైనా పోరాడగలదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.