Ice Cream making Video: ఇది ఐస్‌క్రీమా..? లేక ఆయిల్ క్రీమా..? ఐస్‌క్రీమ్ తయారీకి ఏ రేంజ్‌లో నూనె వాడుతున్నారో చూస్తే..!
ABN , First Publish Date - 2023-06-27T19:49:49+05:30 IST
చల్ల చల్లని ఐస్‌క్రీమ్‌లను అందరూ ఇష్టపడతారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఐస్‌క్రీమ్ రుచిని ఆస్వాదించాలనుకుంటారు. ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల కొన్ని అనర్థాలున్నాయని తెలిసినా వాటిని అప్పుడప్పుడైనా తినకుండా ఉంటారు
చల్ల చల్లని ఐస్‌క్రీమ్ (Ice Cream)లను అందరూ ఇష్టపడతారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఐస్‌క్రీమ్ రుచిని ఆస్వాదించాలనుకుంటారు. ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల కొన్ని అనర్థాలున్నాయని తెలిసినా వాటిని అప్పుడప్పుడైనా తినకుండా ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న విధానం (Ice Cream making Video) చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మనం తరచుగా తినే మిల్క్ ఐస్‌క్రీమ్‌ల తయారీలో భారీగా నూనె (Oil) ఉపయోగించడం షాకింగ్‌గా ఉంది.
PLANET ASHISH అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఫ్యాక్టరీలో ఐస్‌క్రీమ్‌ల తయారీ విధానాన్ని చూపించారు. మిల్క్ క్రీమ్‌తో ఐస్‌ను తయారు చేసిన తర్వాత వాటిని చాక్లెట్ సిరప్‌లో ముంచుతున్నారు. అయితే ఆ మిల్క్ సిరప్‌లో భారీగా నూనె కలపడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నూనె కలిపిన చాక్లెట్ సిరప్‌లో ఆ ఐస్‌లను ముంచి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొస్తున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది షాకవుతున్నారు. ఈ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది.
Viral News: ఈ ఫొటోలో కనిపిస్తున్న మొక్కలు ఏంటో గుర్తు పట్టగలరా..? నెట్టింట పెద్ద చర్చే జరుగుతోందిగా..!
ఈ వీడియోను ఇప్పటివరకు 35 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఓ మై గాడ్.. ఐస్‌క్రీమ్ తయారీలో నూనె వాడతారా``, ``అది ఐస్‌క్రీమ్ కాదు.. ఆయిల్ క్రీమ్``, ``ఇలాంటి ఐస్‌క్రీమ్‌లు తింటే చాలా ప్రమాదం``, ``స్థానికంగా తయారు చేసే ఐస్‌క్రీమ్‌లలో నాణ్యత ఇలాగే ఉంటుంది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.