ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

#NTR30: కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే డిలే అయింది

ABN, First Publish Date - 2023-03-04T13:49:26+05:30

ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) రాబోయే చిత్రం NTR30 షూటింగ్ త్వరలోనే మొదలవబోతోంది అని తెలిసింది. ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నిర్మిస్తున్నారు. అయితే 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాతో వచ్చిన క్రేజ్ చూసి, ఈ NTR30 సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఏమాత్రం తగ్గకుండా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు అని తెలిసింది. ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.

దర్శకుడు కొరటాల శివ సుమారు ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ కి కావాలనే తీసుకున్నాడు అని తెలుస్తోంది. ఎందుకంటే హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ టెక్నీషియన్స్ ఈ సినిమాకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ సినిమా సముద్రం నేపధ్యం లో జరుగుతోంది కాబట్టి, ప్రతి సారీ గోవా, విశాఖపట్నం వెళ్లి సన్నివేశాలు చిత్రీకరించలేరు కాబట్టి, అవి అక్కడికి వెళ్లకుండానే ఎలా తీస్తే బాగుంటుంది అనే విషయం మీద ఇప్పుడు ప్రకటించిన టెక్నీషియన్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి పని చేస్తున్నట్టుగా తెలిసింది.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఒక ప్రాంతంలో ఒక భారీ సెట్ కూడా వేసినట్టు తెలుస్తోంది. ఈ సెట్ కోసం చాలా ఖర్చు కూడా పెట్టారని అంటున్నారు. ఎందుకంటే ఈ కొరటాల, ఎన్టీఆర్ సినిమా చాలా భారీగా వుండబోతోంది అని, ఇందులో పోరాట సన్నివేశాలు ఇంతకు ముందు ఎన్నడూ లేనంత విధంగా వుండబోతున్నాయని, అందుకని ఈ హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రప్పించి వాళ్ళతో ఇప్పుడు వర్క్ షాప్స్ నడుస్తున్నాయని కూడా అంటున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమా అధికారిక లాంచ్, తరువాత షూటింగ్ ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

Updated Date - 2023-03-04T13:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!