ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: శుభ్రంగా బ్రష్ చేసుకున్నా సరే.. నోట్లో చెడు వాసన పోవడం లేదా..? ఈ 5 చిట్కాలను పాటిస్తే సరి..!

ABN, First Publish Date - 2023-10-03T09:47:12+05:30

నోటి దుర్వాసనకు అసలు కారణాలు ఇవీ.. ఈ 5 చిట్కాలు ఫాలో అయితే చాలు.. అసలు నోటి దుర్వాసన అనే సమస్య ఎప్పుడూ ఎదురుకాదు..

ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు పళ్లు తోముకుంటారు. ఆ తరువాతే ఇతర పనులు మొదలుపెడతారు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునేముందు రెండు పూటలా పళ్లు తోముకున్నా, దంత సంరక్షణ చర్యలు పాటిస్తున్నా కొందరిలో నోరు దుర్వాసన(bad breath) వస్తుంటుంది. నోటి దుర్వాసనను హాలిటోసిస్(Halitosis) అని అంటారు. ఈ దుర్వాసన కారణంగా నలుగురిలో ఉన్నప్పుడు నోరు తెరవాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అసలు నోటి దుర్వాసనకు కారణాలు ఏంటి? దీన్ని పరిష్కరించడానికి పాటించాల్సిన 5 చిట్కాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

నోటి దుర్వాసనకు కారణాలు..(causes of bad breath)

రాత్రి నిద్రపోయిన సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడం తగ్గుతుంది. దీని కారణంగా నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇదే నోటిదుర్వాసనకు కారణం అవుతుంది. తిన్న తరువాత నోటిని సరిగ్గా శుభ్రం చేయనప్పుడు దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహారపదార్థాల కారణంగా కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇది నోటి దుర్వాసను మాత్రమే కాకుండా చిగుళ్ళ వ్యాధి, చిగుళ్ళలో చీము మొదలైన సమస్యలు రావడానికి కారణం అవుతుంది. ధీర్ఘకాలిక మందులు ఉపయోగించేవారిలో కూడా నోటి దుర్వాసన, దంతాల రంగు మారడం వంటి సమస్యలు వస్తాయి.

Smart Phone: స్మార్ట్ ఫోన్ తెగ వాడుతుంటారా? అయితే మీకూ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది..



నోటి దుర్వాసన పరిష్కారానికి 5 చిట్కాలు..(bad breath reduce tips)

నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు చేయాల్సిన మొదటి పని దంత సంరక్షణ(dental care) చర్యలు పాటించడం. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి.

ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునేముందు పళ్లు తోముకోవాలి. పళ్ల మధ్య మురికిని, ఆహార మూలకాలను తొలగించడానికి డెంటల్ ప్లాస్టర్(dental plaster) ను ఉపయోగించవచ్చు.

హడావిడిగా పళ్లు తోముకుని వచ్చేయకుండా నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే టూత్ బ్రష్ ను, నాలుక శుభ్రం చేసుకునే టంగ్ క్లీనర్ ను శుభ్రంగా ఉంచుకోవాలి.

యాంటీ మైక్రోబయల్ మౌత్ వాష్(anti microbial mouth wash) ను ఉపయోగించం వల్ల నోటిలో బ్యాక్టీరియాను తొలగించవచ్చు. బ్రష్ చేసుకున్న తరువాత మౌత్ వాష్ ఉపయోగించవచ్చు. లేదంటే ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో(salted warm water) నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. నోరు తాజాగా ఉండటం కోసం లవంగం మొగ్గను బుగ్గన ఉంచుకోవడం, లేదా ఒక యాలకును నోటిలో ఉంచుకోవడం కూడా నోటి దుర్వాసనకు చెక్ పెట్టడంలో సహకరిస్తుంది.

నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కాబ్టటి శరీరం డీహైడ్రేట్(dehydration) కాకుండా ఉండేందుకు తగినంత నీటిని తాగాలి. మద్యపానం, ధూమపానం సేవించేవారి శరీరం చాలా తొందరగా డీహైడ్రేట్ అవుతుంది. ఇలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!


Updated Date - 2023-10-03T09:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising