Smart Phone: స్మార్ట్ ఫోన్ తెగ వాడుతుంటారా? అయితే మీకూ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది..

ABN , First Publish Date - 2023-10-01T11:09:20+05:30 IST

కొందరు ఫోన్ దగ్గర లేకపోతే కుదురుగా 5నిమిషాలు ఉండలేరు, పిల్లలేమో ఫోన్ ఇవ్వకుంటే అన్నం తినరు, నిద్రపోరు. ఇలా స్మార్ట్ ఫోన్ జీవితాలను ఆక్రమించేసింది. కానీ దీని వల్ల రాబోయే ముప్పు తెలిస్తే షాకవుతారు..

Smart Phone:  స్మార్ట్ ఫోన్ తెగ వాడుతుంటారా? అయితే  మీకూ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది..

స్మార్ట్ ఫోన్ ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఒకప్పుడు ఉదయం లేవగానే అరచేతులను కొందరు, దేవుడి పటాన్ని మరికొందరు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడో.. లేచింది లేవగానే నిద్ర మత్తు వదలకనే పక్కనే ఉన్న ఫోన్ కోసం చేతులతో తచ్చాడి ఫోన్ తీసుకుని టైం చూసుకుని ఆ తరువాత పక్కమీద నుండి లేస్తారు. అప్పుడు మొదలయ్యే ఫోన్ సావాసం రాత్రి పడుకునేవరకు సాగుతూనే ఉంటుంది. కొందరు ఫోన్ దగ్గర లేకపోతే కుదురుగా 5నిమిషాలు కూడా ఉండలేరు. ఇప్పట్లో చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ కు బాగా అడిక్ట్ అయ్యారు. అది లేనిదే అన్నం తినరు కూడా. అంతగా ప్రజల జీవితాలను ఆక్రమించిన స్మార్ట్ ఫోన్ వల్ల పెద్ద ముప్పు ఏర్పడుతోంది. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడే వారు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ కు గురవుతున్నారు. అసలు ఈ స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ ఏంటి? దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటి? దీన్ని ఎలా నివారించాలి? పూర్తీగా తెలుసుకుంటే..

స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్.. (Smartphone vision syndrome)

ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ వాడుతుంటే కంటికి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. వీటిని సరిగ్గా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాద స్థాయి పెరుగుతంది. కంటిమీద పెరిగే ఒత్తిడి(eye pressure) స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ సమస్యకు దారితీస్తుంది. ఇది కొన్ని సంధర్బాలలో కంటిచూపు పోవడానికి కూడా కారణం అవుతుంది. అధికంగా స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ముందు పనిచేసేవారే ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య గురించి వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల కళ్లు సున్నితంగా ఉంటాయి. వారు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే చిన్నతనంలోనే చూపుకు సంబంధించి దారుణ పరిణామాలు ఏర్పడతాయి. ఈ సమస్య బారిన పడకుండా ఉండటం కోసం కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు.

Viral Video: యాక్టింగ్‌లో కమల్ హసన్‌ను మించిపోయాడుగా.. హోం వర్క్ తప్పించుకునేందుకు ఈ పిల్లాడి యాక్షన్ చూస్తే..!ఫోన్ లో టెక్స్ట్ విషయానికి వస్తే చాలామంది చిన్నగా పెట్టుకుంటారు. చిన్న అక్షరాలను చదవడానికి కళ్ళు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అందుకే ఫోన్ లో టెక్ట్స్ సైజ్ పెద్దగా ఉంచుకోవాలి.

స్క్రీన్ బ్రైట్ నెస్ తక్కువ ఉండటం వల్ల వీడియోస్, ఫోటోస్ చూసేటప్పుడు ఆకర్షణీయంగా కనిపించవు. అందుకే స్క్రీన్ వెలుతురు ఎక్కువ పెడతారు. కానీ బ్రైట్ నెస్ కళ్లను దెబ్బతీస్తుంది. దీన్ని ఆటోమేటిక్ సెట్టింగ్ చేసుకుంటే మంచిది.

స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు ఫోన్ ను కళ్లకు దగ్గరగా ఉంచి ఉపయోగించడం చాలామంది అలపాటు. కానీ ఫోన్ ను కళ్ళకు 16-18 అంగుళాల దూరంలో ఉంచి ఉపయోగించాలి. అలాగే ఏవైనా అంశాలు నిశితంగా పరిశీలించాల్సి ఉంటే ఫోన్ ను జూమ్ చెయ్యాలి.

ప్రతి ఒక్క ఫోన్ లో నైట్ మోడ్ ఫీచర్ ఉంటుంది. దీన్ని ఆన్ లో ఉంచుకుంటే ఇది కళ్ళమీద ప్రభావం పడకుండా చేస్తుంది. అలాగే మొబైల్ బ్యాటరీ కూడా నైట్ మోడ్ వల్ల సేవ్ అవుతుంది.

ఫోన్ ముందు కానీ, కంప్యూటర్ ముందు కానీ ఎక్కువసేపు పనిచేస్తున్నట్టైతే ఫోన్ స్క్రన్ లేదా సిస్టమ్ స్క్రీన్ చూస్తున్నప్పుడు కళ్లు రెప్పవేయడం మంచిది. దీనివల్ల కళ్లమీద స్క్రీన్ ప్రభావం తక్కువగా ఉంటుంది.

ToothBrush in Bathroom: బాత్రూంలోనే బ్రష్‌లను ఉంచే అలవాటుందా..? అయితే ఇది ఒక్కసారి చదివితీరాల్సిందే..!


Updated Date - 2023-10-01T11:09:20+05:30 IST