Viral Video: యాక్టింగ్‌లో కమల్ హసన్‌ను మించిపోయాడుగా.. హోం వర్క్ తప్పించుకునేందుకు ఈ పిల్లాడి యాక్షన్ చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-29T15:17:05+05:30 IST

హోం వర్క తప్పించుకోవడానికి ఈ పిల్లవాడు చేసిన యాక్షన్ చూస్తే ఆశ్చర్యపోతారు.

Viral Video: యాక్టింగ్‌లో కమల్ హసన్‌ను మించిపోయాడుగా.. హోం వర్క్ తప్పించుకునేందుకు ఈ పిల్లాడి యాక్షన్ చూస్తే..!

పిల్లలు తమకు ఇష్టం లేని పని చేయాలంటే చాలా బాధపడతారు. పెద్దలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు కానీ పిల్లలు మాత్రం ఈ విషయంలో బాగా బుక్కైపోతారు. పని తప్పించుకోవడానికి వారు చేసే యాక్షన్లు, వారు చెప్పే మాటలు అన్నీ సాకులు అని తెలుస్తున్నా తల్లదండ్రులు వారిని నాలుగు చివాట్లు పెట్టి ఆ తరువాత వదిలేస్తారు. అయితే స్కూల్ హోం వర్క్ అనేది ప్రతి పిల్లవాడికి తప్పనిసరి కదా.. అందుకే ఓ పిల్లాడి తల్లి తన కొడుకును కూర్చోబెట్టి హోం వర్క్ చేయిస్తోంది. హోం వర్క తప్పించుకోవడానికి ఆ పిల్లవాడు చేసిన యాక్షన్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఈ పిల్లాడి యాక్షన్ కమల్ హాసన్ ను మించిపోయింది' అని అంటున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

చిన్నపిల్లలు(Small kids) స్కూల్ తప్పించుకోవడానికి కడుపు నొప్పిగా ఉందని, తలనొప్పిగా ఉందని సాకులు చెబుతారు. సమస్య చెబుతూ వారు ఏడవడం, కన్నీళ్లు పెట్టుకోవడం చేస్తుంటే తల్లిదండ్రుల మనసు కరిగిపోతుంది. వీడియోలో ఒక పిల్లవాడు బల్ల ముందు కూర్చుని హోం వర్క చేస్తున్నాడు. ఆ పిల్లవాడికి హోం వర్క్ చేయడం ఇష్టం లేక ఏడుస్తూ 'నాకు శ్వాస సరిగా ఆడటం లేదు' అని శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నట్టు యాక్షన్ చేస్తూ తన తల్లితో చెబుతాడు. ఆ మాటలు వినగానే ఆ పిల్లాడి తల్లి 'నీకు హోం వర్క్ చేసేటప్పుడే శ్వాస సమస్య వస్తుందా ఆడుకునేటప్పుడు ఆ సమస్య రాదా?' అని అడుగుతుంది. దానికి ఆ పిల్లవాడు 'నాకు ఆడుకునే సమయంలో కూడా సమస్యగానే ఉంటోంది' అని చెబుతాడు. అప్పుడు ఆ పిల్లాడి తల్లి 'మధ్యాహ్నం నువ్వు బాగానే శ్వాస తీసుకున్నావే.. నేను గమనించాను కూడా' అంటుంది. అంతే అప్పటిదాకా ఎంతో ఓపికగా తల్లికి చెబుతున్న పిల్లాడు మళ్లీ ఏడుపు అందుకుంటాడు.

Elephant Video: బండి ఎక్కి వెళ్లిపోతున్న మావటి.. ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చి మరీ ఏం చేసిందంటే..!



ఈ వీడియోను its_me_tarun_shukla అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'పిల్లలు చెప్పే బ్రాండెడ్ సాకు' అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు దీన్ని సరదాగా తీసుకుంటుండగా మరికొందరు ఆ పిల్లాడి తల్లిని మందలిస్తున్నారు. 'ఆ పిల్లాడు నిజమే చెబుతున్నట్టున్నాడు, దయచేసి ఆ పిల్లాడిని భయపెట్టకండి' అని ఒకరు కామెంట్ చేశారు. 'ప్రతి ఇంట్లో జరిగే కథే ఇది' అని మరొకరు అన్నారు. 'దయచేసి పిల్లలతో ప్రేమగా మాట్లాడండి, వారు చెప్పే ప్రతీది అబద్దమే అనుకుంటే అది చాలా తప్పు అవుతుంది' అని మరొకరు అన్నారు.

Buying Flat: ఫ్లాట్‌ను కొనే ఆలోచనలో ఉన్నారా..? ఈ టిప్స్‌ను ఫాలో అయితే డబ్బుల ఖర్చు తగ్గడం గ్యారెంటీ..!


Updated Date - 2023-09-29T15:17:05+05:30 IST