Elephant Video: బండి ఎక్కి వెళ్లిపోతున్న మావటి.. ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చి మరీ ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-09-29T11:46:50+05:30 IST

తనను ప్రేమగా చూసుకునే యజమాని తనను వదిలి వెళుతున్నాడని ఈ ఏనుగు ఎంత రచ్చ చేసిందో చూస్తే..

Elephant Video: బండి ఎక్కి వెళ్లిపోతున్న మావటి.. ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చి మరీ ఏం చేసిందంటే..!

ప్రపంచంలో జంతు ప్రేమికులు చాలామంది ఉవ్నారు. జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటితో అనుబంధం ఎలా ఉంటుందో అనుభూతి చెంది ఉంటారు. జంతువులకు ప్రేమను అందిస్తే అవి మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాయి. కాసింత తిండి, ఉండటానికి ఆవాసం కల్పిస్తే చాలు యజమానుల పట్ల వెలకట్టలేని ప్రేమ కురిపిస్తాయి. అలాగే విశ్వాసంగా ఉంటాయి. ఇక ఏనుగుల విషయానికి వస్తే వాటి మెదడు మనిషిని పోలి ఉంటుందని, అవి చాలా తెలివైనవని చెబుతారు. ఓ ఏనుగుకు తన యజమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా సంతోషపడుతున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు(Rajendra Prasad Movie Rjendrudu-Gajendrudu) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కు ఏనుగుకు మధ్య ఉండే అనుబంధం మంత్రముగ్దులను చేస్తుంది. అదంతా సినిమా అలా రియల్ గా ఎందుకుంటుంది అని కొందరు అనుకుని ఉంటారు కూడా. కానీ అది చాలా తప్పని ఒక వీడియో నిరూపిస్తోంది. వీడియోలో ఒక మావటివాడు(elephant caretaker) ఏనుగును(Elephant) వదిలి వెళ్ళడానికి బైక్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ ఏనుగు మాత్రం అతను వెళ్ళడానికి ససేమీరా ఒప్పుకోవడం లేదు. అతన్ని తొండంతో చుట్టేస్తూ బండి ఎక్కవద్దని వారిస్తుంది. అయినా అతను బండి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే తోకతో కూడా అతన్ని బంధించి బండి నుండి దూరం లాక్కెళుతుంది. ఆ తరువాత అతను అతి కష్టం మీద ఏనుగును తప్పించుకుంటూ బైక్ ఎక్కితే తొండంతో పట్టుకుని అతన్ని బండి మీద నుండి కిందకు లాగేసింది. ఇలా మావటివాడు తనను వదిలివెళ్ళకూడదని అది ఎంతో ప్రయత్నం చేసింది.

Coconut Game: ఇదేం ఆటరా నాయనా..? కొబ్బరి కాయలను పగలగొట్టేందుకు ఇంత రిస్క్ చేయాలా..?



1.48 సెకన్ల నిడివి గల ఈ వీడియోను Ananth Rupanagudi అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'యజమానికి, ఏనుగుకు మధ్య గల బంధం.. అతన్ని ఏనుగు వెళ్ళనివ్వడం లేదు' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా సంతోషపడుతున్నారు. ఏనుగుకు, మావటికి మధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చర్యపోతున్నారు. 'ఈ వీడియో చూస్తే నాక్కుడా అలాంటి ఏనుగును పెంచుకోవాలని ఉంది' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'ఎంత అద్బుతంగా ఉందో' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఏనుగు అంత ప్రేమ చూపిస్తోందంటే ఆ మావటి దాన్ని ఎంత బాగా చూసుకున్నాడో' అని ఇంకొకరు అన్నారు.

2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్లను తీసుకుంటారా..? ఎక్కడెక్కడ తీసుకునే ఛాన్స్ ఉందంటే..!


Updated Date - 2023-09-29T11:46:50+05:30 IST