Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!

ABN , First Publish Date - 2023-10-01T12:20:05+05:30 IST

ల్యాప్టాప్ కొనేముందు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకోకుండా ల్యాప్టాప్ కొనుగోలు చేస్తే ఆ తరువాత భారీ నష్టం భరించాల్సి ఉంటుంది.

Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా?  ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!

స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, టాబ్లెట్, హెడ్ ఫోన్స్ తదితర వస్తువులు కొనడం చాలామందికి ఇష్టం. భారతదేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ సైట్లు అయిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా బోలెడు వస్తువులపై సాధారణ ధరలలో సగంపైగా తగ్గింపు ఇస్తుంటారు. ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం ఆఫర్ లో ఉంటాయి. ఈ పండుగ సేల్ లో భాగంగా చాలామంది ల్యాప్టాప్ లు కొనుగోలు చేస్తారు. అయితే కేవలం ఆన్లైన్ సేల్ లోనే కాదు ల్యాప్టాప్ కొనేముందు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకోకుండా ల్యాప్టాప్ కొనుగోలు చేస్తే ఆ తరువాత భారీ నష్టం భరించాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ కొనుగోల చేసేటప్పుడు చేయకూడని ఆరు తప్పులేంటో తెలుసుకుంటే..

ల్యాప్టాప్ దేనికోసం కొంటున్నారు అనేది చాలా ముఖ్యం. స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్స్ కోసం, యువత గేమింగ్ కోసం, కొందరు ఆఫీస్ వర్క్ కోసం ఇలా ల్యాప్టాప్ కొనుగోలు విషయంలో అవసరాలు వేరువేరుగా ఉంటాయి. గేమింగ్ కోసం ల్యాప్టాప్ కొనేవారు హార్డ్వేర్ చాలా పవర్పుల్ గా ఉన్నది కొనాలి. అలాగే స్టోరేజ్, మెమరీ ఎక్కువ ఉన్న ల్యాప్టాప్ కొనాలి. అదే ఆన్లైన్ క్లాసులు, బ్రౌజింగ్ మొదలైన వాటికోసం అయితే తక్కువ స్టోరేజ్, తక్కువ పవర్ హార్డ్వేర్ ల్యాప్టాప్ కొనుగోలు చేయవచ్చు. అవసరాన్ని బట్టి ర్యామ్ స్టోరేజ్ చూసుకోవాలి.

ToothBrush in Bathroom: బాత్రూంలోనే బ్రష్‌లను ఉంచే అలవాటుందా..? అయితే ఇది ఒక్కసారి చదివితీరాల్సిందే..!



ల్యాప్టాప్ కొనాలనే కోరక సరే కానీ బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలి. ఆపీస్ వర్క్, ఆన్లైన్ క్లాసులు, బ్రౌజింగ్ మొదలైన వాటికోసం 25 నుండి 30వేలలో ఈజీగా మంచి ల్యాప్టాప్ లు వస్తాయి.

ల్యాప్టాప్ వెంట తీసుకుని ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటే ల్యాప్టాప్ పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలి. 13 నుండి 14 అంగుళాల డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్ ను కొనుగోలు చేయాలి. 15 అంగుళాలు ఉన్నది కొనుగోలు చేస్తే దాన్ని మోసుకెళ్ళడం కష్టమవుతుంది. అలాగే ల్యాప్టాప్ బరువు 2కిలోలకు మించి ఉండకూడదనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

ప్రస్తుతం వస్తున్న చాలా ల్యాప్టాప్ లలో కనెక్టీవిటీ పోర్ట్ లు చాలా తక్కువ వస్తున్నాయి. వీటని గమనించి ల్యాప్టాప్ కొనుగోలు చేయడం మంచిది. రెండు టైప్-ఎ యుఎస్బి పోర్టులు(type-A USB port), ఒక టైప్-సి పోర్ట్(type-c port), హెడ్ ఫోన్ జాక్(head phone jack), లాన్ పోర్ట్(lan port), మైక్రో ఎస్డి కార్డ్ రీడర్(micro SD card reader), HDMI పోర్ట్ మొదలైనవి ఉన్న ల్యాప్టాప్ లను కొనుగోలు చేయాలి.

ల్యాప్టాప్ ప్రాసెసర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. Intel Pentium Gold, Atom, Celeron వంటి ప్రాసెసర్లతో కూడిన ల్యాప్టాప్ లు 25వేలలో వస్తాయి. అయితే వీటిని నియంత్రణలో వాడాలి. పనిపెరిగితే ల్యాప్టాప్ పనితీరు మందగిస్తుంది. కొత్తల్యాప్టాప్ కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది.

స్క్రీన్ విషయంలోనూ ల్యాప్టాప్ ల ఎంపిక ముఖ్యం. బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ లలో 720 పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న ల్యాప్టాప్ లు కొనుగోలు చేయాలి.

Smart Phone: స్మార్ట్ ఫోన్ తెగ వాడుతుంటారా? అయితే మీకూ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది..


Updated Date - 2023-10-01T12:20:05+05:30 IST