Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఆవుకు హెడ్ లైట్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
ABN, Publish Date - Dec 22 , 2023 | 08:53 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందరినీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందరినీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి (Viral Video). ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆవుకు హెడ్‌లైట్ అమర్చారు. @Enezator అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు (Jugaad Videos).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆవు (Cow) రాత్రి సమయంలో గడ్డి మేస్తోంది. ఆ ఆవు తలపై ఓ లైట్‌ను అమర్చారు (Head light on Cow). బెల్ట్ సహాయంతో ఆవు రెండు కొమ్ముల మధ్య ఆ లైట్‌ను అమర్చారు. ఆ వెలుగులో ఆవు గడ్డి మేస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. ``స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ`` అని కామెంట్ చేశారు. ఈ వెరైటీ ఐడియా నెట్టింట చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది.
Viral Video: వార్నీ.. ఏం ఐడియా తల్లీ.. హై హీల్స్‌ను ఇలా కూడా వాడొచ్చా.. వీడియో వైరల్!
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 5.5 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``ఇది హైటెక్ ఆవు``, ``ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో``, ``ఆవు రాత్రి గడ్డి మేయాల్సిన అవసరం ఏముంది``, ``ఐడియా బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Dec 22 , 2023 | 08:54 PM