ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TCS: టీసీఎస్ ఉద్యోగులకు బిగ్ న్యూస్... అస్సలు ఊహించని విధంగా...

ABN, First Publish Date - 2023-04-27T21:50:06+05:30

ఐటీ రంగంలో (IT sector) ఎడాపెడా ఉద్యోగాల కోతలు (layoffs) తీవ్ర కలవరానికి గురిచేస్తున్న వేళ... దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ (TCS) టెక్ రంగమంతా ఆశ్చర్యపోయేలా తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐటీ రంగంలో (IT sector) ఎడాపెడా ఉద్యోగాల కోతలు (layoffs) తీవ్ర కలవరానికి గురిచేస్తున్న వేళ... దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ (TCS) టెక్ రంగమంతా ఆశ్చర్యపోయేలా తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. నియామకాలు (hiring) కొనసాగించనుంది. ప్రస్తుతమున్న ఉద్యోగులకు ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలతోపాటు ఇంక్రిమెంట్లు కూడా అందించాలనే ఉద్దేశ్యంతో ఉంది. అంతేకాదు.. ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసాన్ని కూడా తగ్గించాలని భావిస్తోంది. టెక్ రంగంలో సవాళ్లతో కూడిన ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగానే కంపెనీ ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు టీసీఎస్ (TCS) చీఫ్ హ్యూమన్ రిసొర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ (Milind Lakkad) చెప్పారు. ఓ బిజినెస్ డైలీతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. టీసీఎస్‌లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతోపాటు జీతాలను రెట్టింపు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.

‘‘ రెండేళ్లు సంతృప్తికరంగా ముగిసింది నిజమే. ఆ సమయంలో వేరే చోటు ఎక్కువ జీతం కారణంగా కొంతమంది సంస్థ చేజారారు. ఆ సమయంలో కొత్తవారి నియామకాలు జరిగాయి. అదే సమయంలో వేర్వేరు ప్రోత్సాహకాల రూపంలో పరిహారాన్ని అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటుని కల్పించాం. కంపెనీలో అంతర్గతంగా ఉద్యోగుల జీతాల్లో అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నించాం’’ అని మిలింద్ లక్కడ్ ప్రస్తావించారు.

గతేడాది ఉద్యోగుల సంఖ్యలో వృద్ధి...

ఇటివల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ (Tata Consultancy Services) ఉద్యోగుల సంఖ్య 6,14,795కి పెరిగింది. కంపెనీని వీడే ఉద్యోగుల రేటులో (అట్రిషన్ రేట్) 20.1 శాతం మేర తగ్గుదల నమోదవ్వడం ఇందుకు తోడ్పడింది. ఆర్థిక సంవత్సరం 2023లో మొత్తం 22,600 మంది ఉద్యోగులను కంపెనీ నియమించుకుంది. ఆర్థిక సంవత్సరంలో నియామకాల సంఖ్య 1,03,000 సంఖ్యతో పోల్చితే 78 శాతం తక్కువగా ఉంది. కాగా భారత్‌లో వర్క్ చేసేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్ అత్యుత్తమ కంపెనీ అని లింక్డ్‌‌ఇన్ (LinkedIn) రిపోర్ట్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-04-27T21:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising