Viral Video: అక్కడ స్పేస్ లేదు.. వాళ్లే క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియోను చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-11-10T16:02:57+05:30
సర్దుకుపోవడం అనేది భారతీయ మధ్యతరగతి వాసుల డీఎన్‌ఏలోనే ఉంది. డబ్బుల ఖర్చు తగ్గించేందుకు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ఆ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదకర సాహసాలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే సర్దుకుపోవడం అనేది ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
సర్దుకుపోవడం అనేది భారతీయ మధ్యతరగతి (Middle Class) వాసుల డీఎన్‌ఏలోనే ఉంది. డబ్బుల ఖర్చు తగ్గించేందుకు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ఆ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదకర సాహసాలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే సర్దుకుపోవడం అనేది ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుటుంబం బైక్ (Bike) మీద ఎక్కడికో వెళ్తోంది. ఆ బైక్ మీద ఏకంగా నలుగురు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు (Four members on bike). ఆ వీడియో నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది.
purnia_parivar అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో నలుగురు పెద్ద వ్యక్తులు ఒకే బైక్ మీద కూర్చుని ఎక్కడికో వెళ్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి ట్యాంక్‌పై కూర్చోగా, ఇద్దరు వ్యక్తులు వెనకాల కూర్చున్నారు. వెనుక కూర్చున్న మహిళ ఒడిలో ఓ అమ్మాయి కూర్చుంది. ఈ నలుగురూ కలిసి ఒకే బైక్‌పై బిజీగా ఉన్న రోడ్డులో ప్రయాణం చేస్తున్నారు. తోటి ప్రయాణికులు ఎవరో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వెనుక కూర్చున్న మహిళ ధైర్యాన్ని, శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోను ఇప్పటిరకు 1.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. 3.4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ``వారిని ఎగతాళి చేయకండి.. మధ్యతరగతి వారి జీవనం ఇలాగా ఉంటుంది``, ``ఆ బైక్ నడుపుతున్న వ్యక్తికి అవార్డు ఇవ్వాలి``, ``ఇది చాలా ప్రమాదకరం``, ``అక్కడ స్పేస్ లేదు.. వాళ్లే క్రియేట్ చేసుకున్నారు``, ``వామ్మో.. ఇలా జర్నీ చేయడానికి ఎంత ధైర్యం కావాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-11-10T16:02:58+05:30 IST