Viral Video: మా అమ్మ ఈ వీడియోను పంపిందంటూ ఓ వీడియోను ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి.. బైక్‌ను ఎలా మార్చేశాడో చూసి..!
ABN, First Publish Date - 2023-06-10T17:38:59+05:30
సృజనాత్మకత అనేది ఎవరి సొత్తూ కాదు. అవసరం అనేది సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో కొత్త ఆలోచనలు అందరికీ చేరువవుతున్నాయి. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సృజనాత్మకత (Creativity) అనేది ఎవరి సొత్తూ కాదు. అవసరం అనేది సరికొత్త ఆవిష్కరణలకు (Innovation) నాంది పలుకుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో కొత్త ఆలోచనలు అందరికీ చేరువవుతున్నాయి. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను తన అమ్మ తనకు పంపించిందని ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ (Awanish Sharan) తెలిపారు.
శరణ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి బైక్ మీద అమర్చిన మిషన్ (Flour Mill) ద్వారా పిండి ఆడుతున్నాడు. సాధారణ మిల్లులాగానే ఆ బైక్‌పై ఉన్న యంత్రంలో సెనగలు వేస్తే.. కింద నుంచి పిండి వచ్చేస్తోంది. అవనీష్ శరణ్ ఇంటి దగ్గర ఆ వ్యక్తి బైక్‌పై మిల్లు ఆడుతుండగా అతని తల్లి వీడియో తీసి పంపించారట. బైక్‌పై పిండి మిల్లు (Flour mill on Bike) అనే ఆలోచనకు ముగ్ధుడైన అవనీష్ వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అద్భుతమైన ఆవిష్కరణ అంటూ ప్రశంసించారు.
Viral Video: అలా వదిలేసి ఉంటే.. ఆకలిదప్పులతో చచ్చిపోయి ఉండేది.. రిస్క్ చేసి మరీ ఆ గుడ్లగూబను రక్షించి..!
పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే ఈ వీడియో (Jugaad video)ను దాదాపు 3.8 లక్షల మంది వీక్షించారు. ఆ వ్యక్తిపై చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. భారత్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని, ప్రోత్సహించే వారే కరువయ్యారని ఒకరు పేర్కొన్నారు. ఇది చాలా సరళమైన, వినూత్నమైన ఐడియా అని మరొకరు ప్రశంసించారు.
Updated Date - 2023-06-10T17:38:59+05:30 IST