Viral Video: అలా వదిలేసి ఉంటే.. ఆకలిదప్పులతో చచ్చిపోయి ఉండేది.. రిస్క్ చేసి మరీ ఆ గుడ్లగూబను రక్షించి..!

ABN , First Publish Date - 2023-06-10T16:32:34+05:30 IST

కొన్నిసార్లు జంతువులు, పక్షులు ఇబ్బందుల్లో పడుతుంటాయి. తమంతట తాముగా బయటపడలేని సమస్యల్లో చిక్కుకుంటాయి. అలాంటి సమయాల్లో వాటికి మనుషుల సహాయం అవసరం. అలాంటి సందర్భాల్లో కొందరు వ్యక్తులు మాత్రమే సకాలంలో స్పందించి వాటిని కాపాడుతుంటారు.

Viral Video: అలా వదిలేసి ఉంటే.. ఆకలిదప్పులతో చచ్చిపోయి ఉండేది.. రిస్క్ చేసి మరీ ఆ గుడ్లగూబను రక్షించి..!

కొన్నిసార్లు జంతువులు, పక్షులు ఇబ్బందుల్లో పడుతుంటాయి. తమంతట తాముగా బయటపడలేని సమస్యల్లో చిక్కుకుంటాయి. అలాంటి సమయాల్లో వాటికి మనుషుల సహాయం అవసరం. అలాంటి సందర్భాల్లో కొందరు వ్యక్తులు మాత్రమే సకాలంలో స్పందించి వాటిని కాపాడుతుంటారు. తమకు ఇబ్బంది అనిపిస్తే చాలా మంది వెనకడుగు వేస్తారు. అయితే సమస్యల్లో ఉన్న ఇతర జీవులకు సహాయం చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టే మంచి మనుషులు ఇప్పటికీ ఉన్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ గుడ్లగూబ (Owl) సరస్సు పైన ఓ తీగలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేక అలాగే ఉండిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తి సరస్సులోకి దిగి నెమ్మదిగా నడుచుకుంటూ దాని దగ్గరకు వెళ్లాడు. ఆ తీగ నుంచి గుడ్లగూబను తప్పించాడు. దానిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ గుడ్లగూబ రెక్కలో ఇరుక్కున్న తీగను నిప్పుతో కాల్చాడు.

Metro Train: మెట్రోలో సడన్‌గా డాన్స్ మొదలు పెట్టిందో యువతి.. పక్కనే ఉన్న ఈ అంకుల్ రియాక్షన్స్ చూస్తే నవ్వాపుకోలేరు..!

అతడు ఆ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆ గుడ్లగూబ సెలైంట్‌గా ఉండి అతడికి సహకరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 27 లక్షల మంది వీక్షించారు. మానవత్వంతో ఆ గుడ్లగూబను కాపాడేందుకు రిస్క్ చేసిన ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-06-10T16:32:34+05:30 IST