Metro Train: మెట్రోలో సడన్‌గా డాన్స్ మొదలు పెట్టిందో యువతి.. పక్కనే ఉన్న ఈ అంకుల్ రియాక్షన్స్ చూస్తే నవ్వాపుకోలేరు..!

ABN , First Publish Date - 2023-06-10T15:59:03+05:30 IST

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల విన్యాసాలతో నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అబ్బాయిలు ప్రాణాంతక సాహసాలకు దిగుతారు. అమ్మాయిలు ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్లలో డ్యాన్స్‌లు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు.

Metro Train: మెట్రోలో సడన్‌గా డాన్స్ మొదలు పెట్టిందో యువతి.. పక్కనే ఉన్న ఈ అంకుల్ రియాక్షన్స్ చూస్తే నవ్వాపుకోలేరు..!

సోషల్ మీడియాలో (Social Media) పాపులర్ అయ్యేందుకు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల విన్యాసాలతో నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అబ్బాయిలు ప్రాణాంతక సాహసాలకు దిగుతారు. అమ్మాయిలు ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్ల (Metro Trains)లో డ్యాన్స్‌లు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఓ అమ్మాయి కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. అయితే ఆ వీడియో చూసిన వారికి ఆ అమ్మాయి కాకుండా ఆమె వెనుక నిలబడి ఉన్న ఓ అంకుల్ నచ్చాడు. @HasnaZarooriHai అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి ఢిల్లీ మెట్రోలో (Delhi Metro Train) ప్రయాణం చేస్తోంది. హఠాత్తుగా ఆమె ఓ హాట్ సాంగ్‌కు డ్యాన్స్ (Dacne in Metro Train) చేయడం ప్రారంభించింది. ఆమె ముందు నిలబడి వీడియో రికార్డు చేస్తున్నారు. చుట్టూ ఉన్న వారు ఆ అమ్మాయి డ్యాన్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు.

Viral News: చెత్త ఏరుకుంటున్న ఈ అమ్మాయిని నా ఫొటోలోంచి తీసేయండంటూ ఓ యువతి ట్వీట్.. అడిగినట్టే చేసి షాకిచ్చిన నెటిజన్లు..!

ఆమె వెనుక నిల్చున్న ఓ వ్యక్తి మాత్రం ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. యువతి డ్యాన్స్ కంటే ఆ అంకుల్ రియాక్షన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``పాపం.. ఆ అంకుల్ చాలా భయపడినట్టు ఉన్నాడు``, ``ఆ తర్వాత ఆ అంకుల్ ఏమయ్యాడు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-10T15:59:03+05:30 IST