ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: వామ్మో.. ఆకాశంలో ఉండగానే తెరుచుకున్న విమానం డోర్.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం!

ABN, First Publish Date - 2023-06-17T15:46:42+05:30

భూమికి వేల అడుగుల ఎత్తులో గాల్లో ఉండగానే ఓ విమానం అత్యవసర ద్వారం తెరుచుకుంది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూమికి వేల అడుగుల ఎత్తులో గాల్లో ఉండగానే ఓ విమానం (Aeroplane) అత్యవసర ద్వారం తెరుచుకుంది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు. చివరకు ఆ విమానం సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Flight Door Opens Mid-Air In Brazil).

Breaking Aviation News & Videos అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. బ్రెజిలియన్ ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ (Tierry) తన బృందంతో కలిసి ఈ విమానంలో ప్రయాణించారు. మారన్ హావోలోని సావో లూయిస్ లో ప్రదర్శన అనంతరం టియెర్రీ, అతని బ్యాండ్ సభ్యులు ఆ విమానంలో ప్రయాణించారు. ఎన్ హెచ్ ఆర్ టాక్సీ ఏరియో నిర్వహిస్తున్న ఎంబ్రేయర్ -110 విమానం గాల్లో ఉండగానే కార్గో డోర్ తెరుచుకుంది. అయినా ఎవరూ కంగారు పడకుండా సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Crime: బుల్లెట్ షాకిచ్చింది.. భార్యను కౌగిలించుకుని తుపాకీతో కాల్చాడు.. బుల్లెట్ తనకూ తగలడంతో ప్రాణం కోల్పోయాడు!

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, బ్యాండ్ సభ్యులందరూ సురక్షితంగా హోటల్‌కు తిరిగి వచ్చారని స్థానిక మీడియా తెలిపింది. కాగా, ఈ ఘటనకు గల కారణాలపై విచారణ ప్రారంభమైంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. దాదాపు 1.40 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చాలా సరదాగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. చాలా భయంకరంగా ఉందని మరొకరు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-17T15:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising