Crime: బుల్లెట్ షాకిచ్చింది.. భార్యను కౌగిలించుకుని తుపాకీతో కాల్చాడు.. బుల్లెట్ తనకూ తగలడంతో ప్రాణం కోల్పోయాడు!

ABN , First Publish Date - 2023-06-16T20:17:41+05:30 IST

కట్టుకున్న భార్యను చంపాలని కుట్ర చేశాడు. ఆమెను ప్రేమగా కౌగిలించుకుని చంపెయ్యాలనుకున్నాడు. అయితే విధి వక్రించి తన ప్లాన్‌కు తానే బలయ్యాడు. భార్యతో పాటు అతడూ ప్రాణం కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లో జూన్‌ 13వ తేదీన ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Crime: బుల్లెట్ షాకిచ్చింది.. భార్యను కౌగిలించుకుని తుపాకీతో కాల్చాడు.. బుల్లెట్ తనకూ తగలడంతో ప్రాణం కోల్పోయాడు!

కట్టుకున్న భార్యను చంపాలని కుట్ర చేశాడు. ఆమెను ప్రేమగా కౌగిలించుకుని చంపెయ్యాలనుకున్నాడు. అయితే విధి వక్రించి తన ప్లాన్‌కు తానే బలయ్యాడు. భార్యతో పాటు అతడూ ప్రాణం కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో జూన్‌ 13వ తేదీన ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది (Crime News).

మొరాదాబాద్‌ పరిధిలోని ఖాన్‌పూర్‌ గ్రామానికి చెందిన అనేక్‌ పాల్‌ (40), అతని భార్య సుమన్‌ పాల్‌ (38) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు. కొద్దిరోజుల క్రితం సుమన్‌ తన మొబైల్‌ను పోగొట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యపై అనేక్ పాల్ కోపం పెంచుకుని ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గత మంగళవారం రాత్రి అనేక్‌పాల్‌.. భార్య వద్దకు వెళ్లి ప్రేమగా కౌగిలించుకున్నాడు. తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీ (Pistol) తీసి భార్యను వెనుకవైపు నుంచి వీపుపై కాల్చాడు.

Viral Video: చీర కట్టుకుని.. కళ్లకు గంతలు కట్టుకుని.. స్కూటీపై నిల్చుని రివర్స్ జంప్.. ఆ యువతి ఎందుకిలా అవాక్కయిందో మీరే చూడండి..!

బుల్లెట్ (Bullet) ఆమె వీపు గుండా దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చి అనేక్‌ పాల్‌ గుండెను చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వాళ్లు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-06-16T20:17:41+05:30 IST