ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Donkey vs Old Man: పాపం.. ఈ పెద్దాయన.. తన మానాన తాను రోడ్డుపై వెళ్తోంటే.. ఈ గాడిద ఏం చేసిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-07-11T10:07:00+05:30

వృద్దుడిని చూడగానే ఆ గాడిదకు ఏం గుర్తొచ్చిందో ఏమో కానీ.. అది చేసిన పనికి ఆ వృద్దుడు షాకయ్యాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రహదారుల మీద వెళ్తున్నప్పుడు ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.ఓ పెద్దాయన తనెప్పుడూ ఎప్పుడూ నడుచుకుంటూ వెళ్లే దారిలోనే తన మానాన తాను వెళుతున్నాడు. ఆ దారికి పక్కనే ఓ గాడిద చాలా సైలెంట్ గా నిల్చుంది. పెద్దాయనను చూడగానే దానికేం పూనిందో ఏమో కానీ రెచ్చిపోయింది. ఒక్కసారిగా అది చేసిన పనికి ఆ వృద్దుడు షాకయ్యాడు. ఆ దారిన వెళుతున్నవారు కూడా ఆ గాడిద చర్యకు విస్తుపోయారు. ప్రస్తుతం ఈ గాడిదకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బాగా బద్దకంగా ఉన్నవాళ్ళను గాడిద(Donkey) అని తిడతారు. అదేవిధంగా అడ్డమైన చాకిరీ చేసేవాళ్లను కూడా గాడిద అని అంటారు. ఇలా మనిషిని తిట్టడంలో గాడిదను బాగా వాడేస్తుంటారు. ఇతర జంతువులతో పోలిస్తే గాడిదల మీద కాసింత చిన్నచూపే ఉంటుంది. కొట్టినా, తిట్టినా గాడిదలు దులుపుకుని వెళ్ళిపోవడం చూసుంటాం. కానీ ఎవరూ ఏమీ అనకపోయినా ఓ గాడిద పిచ్చెత్తిపోయింది. వీడియోలో తెల్లని లాల్చీ పైజామా వేసుకున్న ఓ పెద్దాయన(old man) తన మానాన తను ఓ వీధిలో నడుస్తూ వెళుతున్నాడు. ఆ వీధిలో జనసంచారం కూడా లేదు. దారికి ఒకవైపు ఓ గాడిద నిల్చుంది. అటుగా వచ్చిన పెద్దాయనను చూడగానే దానికేం బుద్దిపుట్టిందో కానీ అది ఒక్కసారిగా పెద్దాయన మీద దాడిచేసింది(donkey attack to old man). అది వెనుక నుండి పెద్దాయనను ముందుకు తోసి ఆయన కాలు నోటితో పట్టుకుంది. దాన్నుండి తప్పించుకోవడానికి ఆ పెద్దాయన ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకపోయింది. అయితే అప్పుడే అటుగా ఒక స్కూటీ మీద వచ్చినవారు స్కూటీ ఆపి ఆయన్ను కాపాడటానికి ప్రయత్నించారు. మరొకవైపు నుండి కూడా ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి గాడిదను కొట్టాడు. మెల్లగా జనం అక్కడ పోగయ్యారు. ఎవరెంత కొట్టినా, అదిలించినా ఆ గాడిద ఇంచ్ కూడా అక్కడినుండి కదల్లేదు. ఆ పెద్దాయన మీద దానికేం పగ ఉందో ఏమో కానీ అది ఆయన్ను వదల్లేదు. ఆయన కాలును కొరికేసింది(donkey bite old man leg). చివరికి ఓ వ్యక్తి పెద్ద కర్ర తీసుకుని తన శక్తి కొద్ది ఆ గాడిదను పదేపదే బాది దాన్ని అక్కడినుండి తరిమేశాడు. ఈ సంఘటన ఆ వీధిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో(CC Camera) రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: ఓ యువతికి బంపరాఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఒకే ఒక్క వీడియోను చూసి జాబ్ ఇస్తానంటూ ప్రకటన..!


ఈ వీడియోను Gha4r Ke Kalesh అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'గాడుదులు ఎవ్వరికీ హాని చెయ్యవని ఇన్నీ రోజులు అనుకున్నాను. ఇప్పుడు కొత్త భయం తయారయ్యింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'చివరి వ్యక్తికి చాలా థాంక్స్, అతని వల్లే ఆ గాడిద పెద్దాయనను వదిలి వెళ్ళిపోయింది' అని మరొకరు కామెంట్ చేశారు. 'పెద్దాయనకు సహాయం చెయ్యడానికి అంతమంది ముందుకు రావడం సంతోషంగా ఉంది' అని మరికొందరు అంటున్నారు.

Dia Mirza Health Secret: ఈ హీరోయిన్ వయసు ఏకంగా 41 ఏళ్లు.. అయినా 21 ఏళ్ల యువతిలాగే ఎలా కనిపిస్తోందంటే..


Updated Date - 2023-07-11T10:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising