Dia Mirza Health Secret: ఈ హీరోయిన్ వయసు ఏకంగా 41 ఏళ్లు.. అయినా 21 ఏళ్ల యువతిలాగే ఎలా కనిపిస్తోందంటే..

ABN , First Publish Date - 2023-07-10T15:57:47+05:30 IST

41ఏళ్ళ వయసొచ్చినా కాలేజీ అమ్మాయిలా కనిపించడం వెనుక ఈమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్సే ప్రధాన కారణం. అయితే ఇవన్నీ ప్రతి మహిళా చాలా సింపుల్ గా పాలో అయ్యే టిప్స్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం

Dia Mirza Health Secret: ఈ హీరోయిన్ వయసు ఏకంగా 41 ఏళ్లు.. అయినా 21 ఏళ్ల యువతిలాగే ఎలా కనిపిస్తోందంటే..

తెరమీద హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు. దీని వెనుక మేకప్ దగ్గరనుండి కెమెరా ఫిల్టర్స్ వరకు బోలెడు గమ్మత్తులు ఉంటాయి. కానీ సహజంగా అందంగా ఉండేవారు చాలా కొద్దిమందే.. మేకప్ లేకుండా కొందరు హీరోయిన్స్ ను చూడలేం. కానీ దియా మీర్జా(Dia Mirza) మాత్రం నాచురల్ బ్యూటీ అండీ బాబూ. 41ఏళ్ళ వయసులో కూడా 21ఏళ్ళ యువతిలా యవ్వనంగా ఉన్న ఈ బాలీవుడ్ భామ పలు సినిమాల్లో నటించింది. ఈమె నటి మాత్రమే కాదు మోడల్(model), ఫెమీనా మిస్ ఇండియా(femina miss india), మిస్ ఆసియా పసిఫిక్(miss Asia pacific) టైటిల్ విన్నర్ కూడా. 2021లో రిలీజైన అక్కినేని నాగార్జున సినిమా వైల్డ్ డాగ్(Akkineni Nagarjuna Wild Dog movie) లో ఈమె గెస్ట్ రోల్ చేశారు. ఇంత వయసొచ్చినా కాలేజీ అమ్మాయిలా కనిపించడం వెనుక ఈమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్సే ప్రధాన కారణం. అయితే ఇవన్నీ ప్రతి మహిళా చాలా సింపుల్ గా పాలో అయ్యే టిప్స్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఇంతకూ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

దియామీర్జా ముఖం చందమామలాగా ఉంటుంది. చందమామకు అయినా మచ్చ కనబడుతుందేమో కానీ ఈమె ముఖం మీద వెతుకుదామంటే ఒక్క మచ్చ కూడా ఉండదు(spotless face skin). దీనికి కారణం ఆమె రసాయనాలతో కూడిన ప్రోడక్ట్ లకు దూరంగా ఉండటమే. ముఖానికి మార్కెట్లో దొరికే స్క్రబ్ లను ఉపయోగించదు. వాల్ నట్, ప్లమ్స్, అలోవెరా జెల్ మూడు మిక్స్ చేసి ఆమె సహజంగా స్క్రబ్ తయారుచేసుకుని (Natural scrub)వాడుతుందట.

యవ్వనంగా కనిపించడానికి ఈమె ఫాలో అయ్యే మరొక గొప్ప చిట్కా విటమిన్-సి(Vitamin-C). రోజూ విటమిన్-సి కలిగిన పండ్లను ఎక్కువగా తీసుకుంటుంది. నారింజ పండ్లను డైట్ లో ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటుంది. అంతే కాదు ఈ నారింజ తొక్కను(Orange peel for skin) చర్మ సౌందర్యం కోసం విరివిగా ఉపయోగిస్తుంది. ఇదే ఆమె ముఖంలో మెరుపు వెనుక రహస్యం.

SBI ATM: 10 సెకన్లలో మాయమైపోయిన ఎస్బీఐ ఏటీఎం.. అదేంటని అవాక్కవుతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!


చర్మసంరక్షణ విషయానికి వస్తే ఆమె ఉపయోగించే బ్రాండ్ లు అన్నీ ఆర్గానిక్ ఉత్పత్తులే(Organic products). ఇవి చర్మాన్ని సహజంగా తాజాగా ఉంచుతాయి. దీనివల్ల చర్మం డ్యామేజ్ జరగదు. ఇంకా చర్మం కోసం లైట్ కవర్ ఫౌండేషన్లు(Light cover foundation) ఉపయోగిస్తుంది.

యోగా అనేది హీరోయిన్లు మోడల్స్ చాలా మంది ఫాలో అవుతారు. దియా మీర్జా కూడా ప్రతి రోజు 15నిమిషాలు యోగా(Yoga) ఫాలో అవుతుంది. ఇందులో ఎక్కువగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి(Breathing exercise). అలాగే శరీరం హైడ్రేట్ గా ఉండటానికి శరీరానికి సరిపడినంత నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రెండు గ్లాసుల నీరు త్రాగడంతో ఈమె రోజు మొదలవుతుంది.

Health Tips: దేవుడి పూజకు మాత్రమే వినియోగిస్తుంటాం కానీ.. కర్పూరంను ఇలా కూడా వాడచ్చని తెలుసా?


Updated Date - 2023-07-10T15:59:21+05:30 IST