SBI ATM: 10 సెకన్లలో మాయమైపోయిన ఎస్బీఐ ఏటీఎం.. అదేంటని అవాక్కవుతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-10T11:52:45+05:30 IST

ఇద్దరు వ్యక్తులు ఏటీఎం నుండి అలా వెళ్ళి, ఇలా తిరిగి రాగానే అక్కడి సీన్ చూసి షాకయ్యారు.

SBI ATM: 10 సెకన్లలో మాయమైపోయిన ఎస్బీఐ ఏటీఎం.. అదేంటని అవాక్కవుతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!

అప్పటివరకు ఎంతో మంది కస్టమర్లకు సేవలు అందించింది ఆ ఏటీఎం. లక్షలాది రూపాయలను తనలో ఉంచుకుని ప్రజల జీవితాల్లో మమేకమైంది. అలాంటి ఏటీఎం కేవలం పదే పది సెసెన్లలో కనుమరుగైంది. ఇదేదో మ్యాజిక్ అనుకుంటే పొరపాటే.. అప్పటిదాకా ఆ ఏటీఎం ఎదురుగా నిలబడుకుని మాట్లాడుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడినుండి అలా వెళ్ళి, ఇలా తిరిగి రాగానే అక్కడి సీన్ చూసి షాకయ్యారు. ఈ ఏటీఎం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలింతకూ ఏటీఎం మాయమవడం ఏంటి? అసలేం జరిగింది? పూర్తీగా తెలుసుకంటే..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం(Himachal Pradesh) మనాలిలో(Manali) ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలోని బహాంగ్ లో ఎస్బీఐ ఏటీఎం(SBI ATM) ఉంది. ఈ ఏటీఎం ను రహదారి అంచులో ఉన్న చిన్న కాంప్లెక్స్ లో ఏర్పాటుచేశారు. ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో వరదలు(floods in Himachal Pradesh) సంభవిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఈ ఎస్బీఐ ఏటీఎం వెనుక భాగం వైపు నీరు చాలా ఉధృతంగా ప్రవహింస్తోంది. వీడియోలో వర్షం కురుస్తోంటే రహదారి మీద గొడుగులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారు ఎదురుగా ఉన్న ఏటీయం వైపు చూస్తూ ఏదో మాట్లాడుకుని ఆ తరువాత అక్కడి నుండి ముందుకు వెళ్లిపోతారు. ఎస్బీఐ ఏటీఎం, దానిప్రక్కన రెండు షాపులకు షట్టర్ వేస ఉండటం చూడచ్చు. ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి అలా వెళ్ళగానే ఆ ఏటీఎం వెనుక వరద ఉధృతానికి ఒక్కసారిగా కుంగిపోయి వరదలో కలిసిపోయింది(SBI atm sag and sunk). దట్టమైన పొగ మాత్రమే చూసేవారికి కనిపించింది.

Health Tips: దేవుడి పూజకు మాత్రమే వినియోగిస్తుంటాం కానీ.. కర్పూరంను ఇలా కూడా వాడచ్చని తెలుసా?


ఈ వీడియోను Akashdeep Thind అనే ట్విట్టర్ అకౌంట్(Twitter) నుండి షేర్ చేశారు. వర్షాకాలం మనాలిని చాలా దారుణంగా దెబ్బతీస్తోంది అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'నేను బహాంగ్ లో నివసించినప్పుడు ఆ ఏటీఎం ను చాలాసార్లు ఉపయోగించాను, అది ఎప్పుడో ఒకరోజు ఇలా కుంగిపోతుందని నాకు తెలుసు' అని గతంలో ఆ ప్రాంతంలో నివసించిన ఒకరు కామెంట్ చేశారు. 'నది ఒడ్డున అక్రమంగా కట్టిన ఆ ప్రాంతాన్ని నది తనలో కలిపేసుకుంది అంతే..' అని మరొకరు కామెంట్ చేశారు.

Long Hair: ఈ ఒక్క ఆకును మూడురకాలుగా ఉపయోగిస్తే చాలు.. పొడవైన జుట్టు మీ సొంతమవడం ఖాయం..


Updated Date - 2023-07-10T11:52:45+05:30 IST