Health Tips: దేవుడి పూజకు మాత్రమే వినియోగిస్తుంటాం కానీ.. కర్పూరంను ఇలా కూడా వాడచ్చని తెలుసా?

ABN , First Publish Date - 2023-07-09T16:27:17+05:30 IST

కర్పూరాన్ని ఇలా కనుక వాడితే అద్భుతమైన ఫలితాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది..

Health Tips: దేవుడి పూజకు మాత్రమే వినియోగిస్తుంటాం కానీ.. కర్పూరంను ఇలా కూడా వాడచ్చని తెలుసా?

దేవుడి పూజలో భాగంగా హారతికోసం కర్పూరం వినియోగించడం అందరికీ తెలిసిందే.. ఘాటుగానూ, ఆహ్లాదంగానూ ఉండే కర్పూరం వాసన మనసుకు హాయినిస్తుంది. తినడానికి తయారు చేసే కర్పూరంను కొన్ని రకాల తీపి పదార్థాలలోనూ, దేవుడి నైవేద్యాలలోనూ ఉపయోగిస్తారు. అయితే కర్పూరంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. కర్పూరంను ఇలా కనుక వాడారంటే అద్భుతం జరుగుతుంది. ఎవ్వరికీ ఎక్కువగా తెలియని ఆ ఆరోగ్యప్రయోజనాలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

కొబ్బరినూనెలో కర్పూరాన్ని(coconut oil with camphor) కలిపి వేడిచేసి నిల్వచేసుకోవాలి. దీన్ని కండరాల నొప్పులు(muscle pains), కండరాల తిమ్మిర్లు(muscle cramps), వాపు ఉన్నచోట అప్లై చేయాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను జలుబు, దగ్గు ఉన్నప్పుడు కొద్దిగా ఛాతీపై రాస్తే తొందరగా తగ్గుతుంది. అలాగే తక్కువ కర్పూరాన్ని కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. దీన్ని తలకు మర్థనాచేసి ఆ తరువాత రోజు తలస్నానం చేస్తుంటే తలలో చుండ్రు, కురుపులు తగ్గిపోతాయి. ఈ కారణంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

హైపర్ ఎసిడిటీ(hyper acidity) ఉన్నవారికి కడుపులో గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కడుపులో యాసిడ్ లు ఎక్కుగా ఏర్పడటం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే కర్పూరం నూనెను వాడాలి. కర్పూరం నూనెలో ఆల్కలీన్ లక్షణాలుంటాయి. ఇది కడుపులో యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

Viral Video: 200నోటుతో మ్యాజిక్ చేసిన వృద్దుడు.. తేనె పోసి అగ్గిపుల్లతో వెలిగించాడు.. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..


విపరీతమైన తలనొప్పితో(headache) బాధపడేవారికి కర్పూరంతో అద్భుతమైన ఔషదం తయారుచేయవచ్చు. ఎండు అల్లం, లవంగం, కర్పూరం, తెల్లమద్ది చెట్టు బెరడు, చందనం అన్నీ సమాన భాగాలుగా తీసుకుని పొడి చేసుకుని నిల్వచేసుకోవాలి. విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు కొద్ది పొడిలో కొద్దిగా నీరు వేసి నూరి లేపనంలాగా తలకు పట్టిస్తే నిమిషాల మీద తలనొప్పి మాయమవుతుంది. కర్పూరం వాసన చూసేవారికి మతిమరుపు సమస్య రాదు. మతిమరుపు సమస్య ఉన్నవారికి సమస్య క్రమంగా తగ్గుతుంది.

దృష్టిలోపం(Eye sight), ఇతర కంటి సమస్యలు వేధిస్తోంటే అరటి చెట్టుకుకారే పాలను(banana milk) సేకరించి అందులో కర్పూరాన్ని కలిపి మెత్తగా నూరాలి. దీన్ని రాత్రి పడుకునేముందు కళ్ళకు కాటుకలాగా(Kajal) పెట్టుకోవాలి. అన్నిరకాల కంటిజబ్బులు తగ్గిపోతాయి.

ఇక ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది. దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఇంట్లో కర్పూరం వెలిగిస్తే చాలు దోమలు ఇంట్లోకి రావు.

Viral Video: ఈ చిరుత ఇంత తెలివితక్కువదేంటీ.. సులువుగా అడవి పందినైతే పట్టుకుంది కానీ.. ఆ తరువాత అది చేసిన పనికి..


Updated Date - 2023-07-09T16:27:17+05:30 IST