ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dhanush: 1500మంది ఫైటర్స్.. 16గంటల షూటింగ్.. భారీ యాక్షన్ స్టంట్..

ABN, First Publish Date - 2023-03-04T19:03:10+05:30

కొత్త రకం సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొత్త రకం సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందుతుంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..

‘కెప్టెన్ మిల్లర్’ లో భారీ స్థాయి యాక్షన్ సన్నివేశం ఉందట. ఈ స్టంట్‌ను 1500మంది ఫైటర్స్‌తో షూట్ చేశారట. సన్నివేశాన్ని నాన్‌స్టాప్‌గా 16గంటల పాటు చిత్రీకరించారని సమాచారం. ఈ సన్నివేశం కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. పాన్ ఇండియగా రూపొందుతుంటంతో ఖర్చుకు వెనుకాడటం లేదట. ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ సీన్ ఇదేనని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘కెప్టెన్ మిల్లర్’ ను జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ధనుష్ చివరగా ‘వాత్తి’ (Vaathi) లో నటించారు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగులోకి ‘సార్’ (Sir) టైటిల్‌తో డబ్ అయింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-04T19:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising