ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. ఈ దొంగలు మామూలోళ్లు కాదుగా.. ఇంటికి ఒకటికి రెండు తాళాలు వేసినా సౌండ్ రాకుండా గేట్లు ఎలా తీశారో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-03-20T20:52:12+05:30

మనం కుటుంబంతో సహా ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు ఇంటికి తాళం వేసుకుని వెళతాం. కొందరు జాగ్రత్తపరులు గేటుకు రెండేసి తాళాలు వేసి మరీ వెళ్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మనం కుటుంబంతో సహా ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు ఇంటికి తాళం వేసుకుని వెళతాం. కొందరు జాగ్రత్తపరులు గేటుకు రెండేసి తాళాలు వేసి మరీ వెళ్తారు. తాము వచ్చే వరకు ఇంట్లోని వస్తువులు సురక్షితంగా ఉంటాయని అనుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే ఎన్ని తాళాలు వేసినా, ఇంటికి రెండు గేట్లు పెట్టించినా క్షేమం కాదని అర్థమవుతోంది. ఢిల్లీలోని (Delhi) ఓ ఇంట్లో పట్టపగలు ఇద్దరు దొంగలు చోరీకి (Theft) పాల్పడ్డారు. ఆ ఘటన ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది (Delhi Robbery Video).

పశ్చిమ ఢిల్లీలోని భారత్ విహార్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఆ ఇంట్లో పని చేస్తున్న వారే యజమాని లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డారు. బలమైన ఇనుప గేటు, పెద్ద తాళాన్ని వారు ఎలా విరగ్గొట్టి సులభంగా లోపలికి ప్రవేశించారో చూస్తే మాత్రం షాకవడం ఖాయం. ఒక పెద్ద కత్తెర తెచ్చిన యువకుడు గేట్లకు వేసి బలమైన తాళాలను కత్తిరించాడు. మరో వ్యక్తి అటూ, ఇటూ తిరుగుతూ అటు వైపు ఎవరైనా వస్తున్నారేమో అని కాపాలా కాశాడు. తాళాలు కత్తిరించిన తర్వాత ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి వెళ్లారు (Crime News).

Bride: కాబోయే భర్త నోట ఊహించని కోరిక.. ఎంత చెప్పినా వినకపోవడంతో 22 ఏళ్ల ఆ యువతి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

తమకు తెలిసిన ఇల్లే కాబట్టి లోపలికి వెళ్లి నగలు, డబ్బు పట్టుకుని వెళ్లిపోయారు. ఆదివారం వచ్చిన యజమాని ఇంట్లో దొంగతనం జరిగినట్టు తెలుసుకుని సీసీటీవీ ఫుటేజ్ చూశాడు. తన ఇంట్లో పని చేసే అనిత, జితేంద్ర దొంగతనానికి పాల్పడినట్టు తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారు పోలీసుల ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు.

Heartwarming Viral Video: 10 నెలల కూతుర్ని వదిలి వెళ్లలేక రైల్లోనే వెక్కి వెక్కి ఏడ్చిన మహిళా జవాన్.. హృదయాన్ని మెలిపెడుతున్న ఘటన..!

Updated Date - 2023-03-20T20:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising