Bride: కాబోయే భర్త నోట ఊహించని కోరిక.. ఎంత చెప్పినా వినకపోవడంతో 22 ఏళ్ల ఆ యువతి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-03-20T20:19:05+05:30 IST
ఆ యువతికి పెళ్లి కుదిరింది.. పెళ్లికి ముందే యువకుడితో మాటలు కలిపింది.. అతడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది.. అతడితోనే జీవితం అని నిర్ణయించుకుంది..
ఆ యువతికి పెళ్లి (Marriage) కుదిరింది.. పెళ్లికి ముందే యువకుడితో మాటలు కలిపింది.. అతడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది.. అతడితోనే జీవితం అని నిర్ణయించుకుంది.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.. ముహూర్త సమయం దగ్గరపడుతుండగా వరుడు (Groom) బాంబు పేల్చాడు.. యువతికి ఫోన్ చేసి ఓ కోరిక కోరాడు.. తనకు ఇస్తానన్న కట్నం కాకుండా ఒక బైక్, రూ.60 కావాలని డిమాండ్ చేశాడు (Dowry).. లేకపోతే పెళ్లి క్యాన్సిల్ అని బెదిరించాడు.. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి (Bride) ఆత్మహత్య చేసుకుంది.
బీహార్‌లోని (Bihar) బెట్టియాలో ఓ యువకుడి ధన దాహానికి ఓ యువతి బలైపోయింది. పెళ్లికి ముందు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బెట్టియాకు చెందిన ముస్కాన్ అనే 22 ఏళ్ల యువతికి ఫిదా హుస్సేన్ (25)తో వివాహం కుదిరింది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వరుడి కుటుంబం వారు అడిగినట్టుగా లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వడానికి వధువు తండ్రి అంగీకరించాడు. ఆ డబ్బులను ముందుగానే అందజేశాడు. అయితే శనివారం సాయంత్రం ముస్కాన్‌కు హుస్సేన్ ఫోన్ చేసి మరో రూ.60 వేలు నగదు, అపాచీ బైక్ కావాలని డిమాండ్ చేశాడు.
Heartwarming Viral Video: 10 నెలల కూతుర్ని వదిలి వెళ్లలేక రైల్లోనే వెక్కి వెక్కి ఏడ్చిన మహిళా జవాన్.. హృదయాన్ని మెలిపెడుతున్న ఘటన..!
తన తండ్రి వద్ద అంత డబ్బు లేదని హుస్సేన్‌కు ముస్కాన్ చెప్పింది. అలాగైతే వివాహం రద్దు చేసుకుందామని హుస్సేన్ బెదిరించాడు. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ముస్కాన్ రోజూ ఫిదా హుస్సేన్‌తో మాట్లాడేదని ఆమె సోదరి రుక్సానా చెప్పింది. ముస్కాన్‌ని కలవడానికి హుస్సేన్ ఆమె ఇంటికి కూడా వెళ్లేవాడు. అతడిని ముస్కాన్ బాగా ఇష్టపడింది. ఒక్కసారిగా పెళ్లి క్యాన్సిల్ అనే సరికి ముస్కాన్ తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.