Natu Natu Song: జోరు వానలో అమెరికా అమ్మాయి మన నాటు నాటు పాటకు డాన్స్ వేస్తే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!

ABN , First Publish Date - 2023-03-20T18:44:54+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ``ఆర్ఆర్ఆర్``లోని ``నాటు నాటు`` పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ను కూడా దక్కించుకుంది.

Natu Natu Song: జోరు వానలో అమెరికా అమ్మాయి మన నాటు నాటు పాటకు డాన్స్ వేస్తే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీయార్ (Jr NTR) కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ``ఆర్ఆర్ఆర్``లోని (RRR) ``నాటు నాటు`` (Naatu Naatu Song) పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్‌ను (Oscar Awards) కూడా దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (Best Original Song category) కేటగిరీలో అవార్డు దక్కించుకున్న ఈ పాటపై సోషల్ మీడియా చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. గత రెండు నెలలుగా ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్‌లో (Trending Song) టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇతర దేశస్థులు కూడా ఈ పాటకు తమదైన శైలిలో చిందులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అమెరికాకు చెందిన ఓ అమ్మాయి తాజాగా ఈ పాటకు జోరు వానలో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. మంచి ఎనర్జీతో ఆమె చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. olgamanassyan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై (Viral Video) కామెంట్లు చేస్తున్నారు. ``ఈ డ్యాన్స్ చూస్తే ఇండియా మొత్తం గర్వపడుతుంద``ని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

Heartwarming Viral Video: 10 నెలల కూతుర్ని వదిలి వెళ్లలేక రైల్లోనే వెక్కి వెక్కి ఏడ్చిన మహిళా జవాన్.. హృదయాన్ని మెలిపెడుతున్న ఘటన..!

``నాటు నాటు`` పాట సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను కూడా మెప్పించి ఆడిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు ఆ పాటకు చిందులేసి ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆస్కార్ వేదిక మీద కూడా ఈ పాటకు విదేశీ డ్యాన్సర్లు చిందులేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-03-20T18:45:12+05:30 IST