ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Full moon: పౌర్ణమిపై శతాబ్ధాలుగా ఉన్న నమ్మకంపై కీలక అధ్యయనం.. ఆశ్చర్యపోయే నిజం వెల్లడి

ABN, First Publish Date - 2023-04-10T21:32:21+05:30

పౌర్ణమికి ఆత్మహత్యలకు సంబంధం ఉందా?.. నిజంగానే ఆత్మహత్యల్లో (Suicides) పౌర్ణమి రోజుల్లోనే అధికంగా నమోదవుతున్నాయా?.. పౌర్ణమి వస్తే కొందరు వ్యక్తుల్లో ఏవో అంతుచిక్కని మార్పులు చోటుచేసుకుంటున్నాయని శతాబ్ధాలుగా జనాలు విశ్వసిస్తున్నది నిజమేనా?..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పౌర్ణమికి ఆత్మహత్యలకు సంబంధం ఉందా?.. నిజంగానే ఆత్మహత్యల్లో (Suicides) పౌర్ణమి రోజుల్లోనే అధికంగా నమోదవుతున్నాయా?.. పౌర్ణమి వస్తే కొందరు వ్యక్తుల్లో ఏవో అంతుచిక్కని మార్పులు చోటుచేసుకుంటున్నాయని శతాబ్ధాలుగా జనాలు విశ్వసిస్తున్నది నిజమేనా?.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తోంది నూతన అధ్యయనం. పౌర్ణమి రోజుల్లో ఆత్మహత్యల రూపంలో చోటుచేసుకుంటున్న మరణాలు పెరిగాయని అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు (Indiana University School of Medicine) చెందిన మానసిక వైద్యులు (psychiatrists) చెబుతున్నారు. పౌర్ణమికి అటు ఇటు రోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయనే పరికల్పనపై (Hypothesis) అధ్యయనం చేయాలని నిర్ణయించామని, అధిక ముప్పున్న వ్యక్తులను ఆ రోజుల్లో నిశితంగా గమనిస్తూ ఉండాలని పరిశోధనలో గుర్తించినట్టు యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెగ్జాండర్ నికులెకు చెప్పారు.

అమెరికాలోని ఇండియానాలో ఉన్న మారియాన్ కౌంటీ కొరోనర్స్ ఆఫీస్ నుంచి ఆత్మహత్యలకు సంబంధించిన డేటా సేకరించినట్టు అలెగ్జాండర్, ఆయన బృందం తెలిపింది. 2012-2016 కాలానికి సంబంధించిన డేటా సేకరించగా.. అధిక ఆత్మహత్యలు పౌర్ణమి సమయాల్లోనే ఉన్నాయని తేలిందన్నారు. పౌర్ణమి వారంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని, వయసు 55 పైబడిన వాళ్లు అధికంగా ఉంటున్నారని అధ్యయనంలో వెల్లడైందని అలెగ్జాండర్ వివరించారు. సెప్టెంబర్‌లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని, మధ్యాహ్నం తర్వాత.. ముఖ్యంగా 3-4 pm సమయంలో ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారని విశ్లేషించారు.

ఈ అధ్యయనంలో తేలిన అంశాలను ‘డిస్కవర్ మెంటల్ హెల్త్’లో (Discover mental healt) ప్రొఫెసర్ అలెగ్జాండర్ బృందం ప్రచురించింది. కాగా మానసిక ఆరోగ్య స్థితిని గుర్తించేందుకుగానూ ఈ బృందం గతంలో బ్లడ్ బయోమార్కర్ టెస్టులను అభివృద్ధి చేసింది. మొత్తంగా సంపూర్ణ పౌర్ణమి, మధ్యాహ్నం తర్వాత ఆత్మహత్యల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. ఒత్తిడి లేదా ఆల్కాహాల్ అలవాటు సమస్యల కారణంగా బాధపడుతున్నవారిలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయని అలెగ్జాండర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

KTR: బండి సంజయ్‌పై కేటీఆర్‌ సెటైర్లు

CM Jagan: ‘కోడికత్తి’లో కొత్త ట్విస్ట్‌

Updated Date - 2023-04-10T21:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising