ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China Youth: రూటు మార్చుతున్న చైనా యూత్.. డ్రాగన్ దేశంలో కొత్త ట్రెండ్.. తోడు కోసం పెళ్లి అక్కర్లేదంటూనే నయా ప్లాన్..!

ABN, First Publish Date - 2023-08-23T11:12:26+05:30

. పెళ్లి, సహజీవనం వంటి గోలలు అక్కర్లేకుండా హాయిగా జీవితం గడపడానికి చైనా యూత్ ఓ కొత్త దారి పట్టింది.

ఓ వయసు వచ్చాక ఏ దేశంలోని వారైనా పెళ్లి చేసుకోడం కామన్. పెళ్లి తరువాత భాగస్వామి, పిల్లలు, వారి బాధ్యతలు ఉండనే ఉంటాయి. కొందరు వీటిని సంతోషంగా స్వీకరిస్తే మరికొందరు బరువు అనుకుంటారు. కానీ జీవితానికి ఒక తోడు ముఖ్యం అనే మాట ఒప్పుకుని తీరాల్సిన నిజం. సంతోషాన్నిబాధను పంచుకోవాలన్నా, భారంగా గడిచే సమయాన్ని ఆహ్లాదంగా మార్చేయాలన్నా ప్రేమగా మాట్లాడేవారు ఉండాలి. పెళ్లి వద్దు, తోడు మాత్రం కావాలని అనుకునేవారు చాలామందే ఉన్నారు ఈ కాలంలో. ఇందుకోసమే సహజీవనం సాగిస్తుంటారు. ఇది కూడా చాలావరకు మనస్పర్థలకు, గొడవలకు దారి తీస్తుంటుంది. పెళ్లి, సహజీవనం వంటి గోలలు అక్కర్లేకుండా హాయిగా జీవితం గడపడానికి చైనా యూత్ ఓ కొత్త దారి పట్టింది. ప్రపంచమంతా ఇప్పుడీ ట్రెండ్ గురించే చర్చిస్తోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇప్పటికాలంలో మనుషులను భరించడం పెద్ద సమస్యగా భావిస్తున్నారు. అభిరుచులు, అభిప్రాయాలు వేరుగా ఉండటం, అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అంటూ నియమాలు పెట్టడం, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటూ నియంత్రించడం భాగస్వాముల విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. ఇందుకే నేటికాలం యువత పెళ్ళి మీద అంత ఆసక్తిగా ఉండరు. చైనా(China)లో కూడా ఇదే ఆలోచనలో అధికశాతం యువత ఉన్నారు. అయితే ఈ సమస్యకు వారు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పెళ్ళి లేకుండా ఓ తోడును వెతుక్కుంటున్నారు. అలాగని ఇదేమీ సహజీవనం కాదు. అసలు మనిషిని నేరుగా కలవడం కానీ, వారితో జీవించడం కానీ ఉండనే ఉండదట. అదేలా సాధ్యం అంటే కేవలం సామాజిక మాధ్యమం ద్వారా రిలేషన్(social media relation) లో ఉండటం.

Viral: ఏలియన్స్ నిజంగానే ఉన్నారా..? 40 ఏళ్ల క్రితం ఆ శాస్త్రవేత్త పంపిన మెసేజ్‌కు.. గ్రహాంతర వాసుల నుంచి రెస్పాన్స్..!?



తమ అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలతో ఏకీభవించే వ్యక్తుల కోసం సోషల్ మీడియాలో ముమ్మరంగా వెతుకున్నారు. ఇలా బంధాన్ని కోరకుంటున్నవారిలో ఒంటరితనం అనుభవిస్తున్నవారే అధికంగా ఉన్నారట. ఇలా సామాజిక మాధ్యమం ద్వారా వీరు కోరుకునేది ఏమిటి అనే సందేహం కలగచ్చు. ఫుడ్, గేమింగ్, ఫిట్ నెస్, వ్యవసాయం, చాటింగ్, సంగీతం వినడం వంటి అభిరుచులతో వీరి రిలేషన్ కొనసాగుతుంది. వీరు నేరుగా కలవాల్సిన అవసరం లేనందున దీనివల్ల ఎలాంటి శారీరక నష్టాలు ఉండవని కూడా అంటున్నారు. ఇకపోతే ఈ రిలేషన్ లో కూడా ఇబ్బందులు ఉండనే ఉంటున్నాయట. తాత్కాలిక రిలేషన్ అని తెలిసి ఈ రిలేషన్ లోకి వచ్చిన కొందరు దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. మొత్తానికి పెళ్ళి తప్పించుకోవడానికి విభిన్న పద్దతులు ఫాలో అవుతూనే ఉన్నారు.

Baby First Haircut: మొట్టమొదటిసారి హెయిర్ కటింగ్.. సెలూన్‌లో ఈ పిల్లాడి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి..!


Updated Date - 2023-08-23T11:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising