ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Burn scars: ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలిన మచ్చలు పోవడం లేదా? ఈ సింపుల్ చిట్కాలతో అవెంత తొందరగా మాయమవుతాయో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-05-08T16:18:51+05:30

కాలిన మచ్చల(burn scars)ను నామరూపాల్లేకుండా పోగొట్టే చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఎప్పటినుండో ఉన్న మచ్చలన్నీ మ్యాజిక్ చేసినట్టు మటుమాయం అవుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు చాలాసార్లు దెబ్బలు తగిలించుకుంటాం. ఆ గాయాల గుర్తులు ఇప్పటికీ శరీరంమీద చాలామందికి అలానే ఉంటాయి. అవి మాత్రమే కాకుండా మహిళలకు ఉన్న మరొక సమస్య వంటగదిలో వంట చేస్తున్నప్పుడు ఒకోసారి నూనె పడుతూ ఉంటుంది, మరికొన్నిసార్లు పొరపాటున కాలుతున్న కుక్కర్లు, స్టవ్ మీదున్న పాన్లు చేతులకు తలుగుతుంటాయి. ఇలాంటివి చాలా వరకు మచ్చలుగా ఉండిపోతాయి.ఇవన్నీ ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. కాలిన మచ్చల(burn scars)ను నామరూపాల్లేకుండా పోగొట్టే చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఎప్పటినుండో ఉన్న మచ్చలన్నీ మటుమాయం అవుతాయి. అసలు మచ్చలు ఎందుకు ఏర్పడతాయి? సింపుల్ గా కాలిన మచ్చలను తొలగించుకునే చిట్కాలేవంటే..

చర్మం ఎపిడెర్మిస్(epidermis), డెర్మిస్(dermis), హైపోడెర్మిస్(hypodermis) అని మూడు పొరలుగా ఉంటుంది. మొదటి పొర వాతావరణం నుండి శరీరాన్ని రక్షిస్తుంది, రెండవ పొర చర్మ సంబంధ సమస్యల నుండి శరీరాన్ని రక్షిస్తుంది, మూడవ పొర కండరాలు ఎముకలకు, రెండవ పొరకు మధ్య ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలో ఏ భాగంలో అయినా కాలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ గా చాలామంది ఏదో ఒక మందు పూస్తూ ఉంటారు. కానీ అలా పూసినప్పుడు ఆ గాయానికి పైన రిలీఫ్ గా అనిపించిన్పపటికీ అది లోతుగా ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా చాలావరకు మచ్చలు చాలా దారుణంగా ఏర్పడతాయి. కాబట్టి కాలినప్పుడు, గాయాలు అయినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏవంటే అవి గాయానికి పూయకూడదు.

Divorce: వామ్మో.. ఇలాంటి కారణాలతో కూడా విడాకులిస్తారా..? మీ భార్యలకు ఎందుకు విడాకులిచ్చారని ఆ నలుగురు భర్తలను అడిగితే..!


కాలినగాయాల తాలూకు మచ్చలు(burn scars) ఇబ్బంది పెడుతూ ఉంటే రాత్రి పూట కురిసిన మంచు(Night fall snow) మంచి ఔషదంగా పనిచేస్తుంది. రాత్రంతా కురిసిన మంచును ఉదయాన్నే సేకరించి దాన్ని కాలిన మచ్చల మీద అప్లై చేయాలి. ఇలా చేస్తే మచ్చలు మెల్లిగా మాయమైపోయి చర్మం సాధారణంగా మారిపోతుంది.

కాలిన గాయాల మచ్చలను తొలగించే మరొక అద్బుతపదార్థం టమాటా(tomato). టమాటా రసానికి కొన్ని చుక్కల నిమ్మరసం(some drops lemon juice) కలిపి ప్రతిరోజూ మచ్చలమీద అప్లై చేస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే తొందరలోనే మచ్చలు పోతాయి.

చాలామంది కాలినప్పుడు మంట నుండి ఉపశమం కోసం కొబ్బరినూనె(coconut oil) రాస్తుంటారు. కానీ కాలిన గాయాలనే కాదు మచ్చలను తగ్గించడంలో కూడా కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. కాలిన మచ్చల మీద ప్రతి రోజూ కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి మర్దనా(coconut oil massage) చేస్తూంటే మచ్చలు మ్యాజిక్ చేసినట్టు మానిపోతాయి.

వంటింట్లోనూ, సౌందర్య సాధనంగానూ, ఆయుర్వేద ఔషదంగానూ ఉపయోగించే పసుపు(turmeric) మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపును పేస్ట్(turmeric paste) గా చేసి మచ్చలున్న చోట రాయాలి. ఆరిపోయిన తరువాత కడిగేస్తుండాలి. తొందరలోనే మంచి ఫలితం ఉంటుంది.

Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..


Updated Date - 2023-05-08T16:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising