ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: బుల్లెట్ బండిపై వధువు గ్రాండ్ ఎంట్రీ.. పెళ్లికి వచ్చిన వారంతా పరేషాన్.. వైరల్ వీడియో!

ABN, First Publish Date - 2023-05-11T11:54:55+05:30

వధువు బుల్లెట్ బండిపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, పెళ్లికి వచ్చిన అతిథులందరినీ కళ్లప్పగించి చూసేలా చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bride Grand Entry on Bullet: వధువు బుల్లెట్ బండిపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, పెళ్లికి వచ్చిన అతిథులందరినీ కళ్లప్పగించి చూసేలా చేసింది. పుణెలో ఓ వధువు (Bride) ఇలా పెళ్లి మంటపం వద్దకు బుల్లెట్ బండిపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా ఆమెను పరేషాన్ అయ్యి చూస్తూ ఉండిపోయారు. దీని తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. అల్లుడికి తన తండ్రి కట్నంగా ఇస్తున్న కొత్త బుల్లెట్‌పై వధువు ఇలా పెళ్లిమంటపం వద్దకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దానిపై వరుడితో కలిసి కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. పుణెలోని (Pune) షిరూర్ తాలుకా, సాన్స్‌వాడి‌లో ఈ వినూత్న దృశ్యం దర్శనమిచ్చింది. ఇక పెళ్లికి వచ్చిన అతిథుల్లో కొందరు వధువు గ్రాండ్ ఎంట్రీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. 1నిమిషం 22 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది (Video goes Viral). దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'బుల్లెట్ బండిపై పెళ్లి కూతురి మాస్ ఎంట్రీ.. అదిరిపోయిందిగా' అంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ బుల్లెట్ బండిపై (Bullet Bandi) వధువు గ్రాండ్ ఎంట్రీపై ఓ లుక్కేయండి.

Viral News: పెళ్లిలో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌కు 4ఏళ్ల తర్వాత పెళ్లికూతురి నుంచి మెసేజ్.. ఆ తర్వాత ఆమె అడిగిన విషయంతో అతడి ఫీజులు ఎగిరిపోయాయి..

Updated Date - 2023-05-11T11:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising