Viral Video: హీరోయిన్‌తో లైవ్ కాల్ మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో అమ్మ వచ్చి ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
ABN, First Publish Date - 2023-10-02T14:56:57+05:30
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య అంతరం తగ్గిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్, జూమ్ కాల్ ద్వారా అభిమానులతో పలువురు సినీ హీరోలు, హీరోయిన్లు టచ్‌లోకి వస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు (Celebrities), అభిమానులకు (Fans) మధ్య అంతరం తగ్గిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ (Instagram live), జూమ్ కాల్ ద్వారా అభిమానులతో పలువురు సినీ హీరోలు, హీరోయిన్లు టచ్‌లోకి వస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓ కుర్రాడు తన అభిమాన నటితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Funny Viral Video) అవుతోంది.
నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్‌నీత్ కౌర్ (Avneet Kaur) ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించింది. ఆ కాల్ ద్వారా ఓ యువకుడితో మాట్లాడింది. ``నా కోసం ఫ్యాన్ పేజీని సృష్టించినందుకు చాలా ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండండి`` అని కుర్రాడితో అవ్‌నీత్ చెబుతోంది. అంతలో ఆ కుర్రాడి తల్లి (Mother) వెనుక నుంచి వచ్చింది. అవ్‌నీత్ కౌర్ బై చెబుతుండగా ఆ కుర్రాడిని వీపు మీద కొట్టింది. అది చూసి అవ్‌నీత్ షాకైంది.
Viral Video: ఎవడ్రా నువ్వు.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు.. బ్లేడు కూడా అవసరం లేకుండా ఎంత నీట్‌గా పర్సు కొట్టేశాడో చూడండి..
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఈ వీడియోను 6.2 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ``అవ్‌నీత్ కౌర్ ఫ్యాన్ పేజీ ఓపెన్ చేసినందుకు ఆ కుర్రాడికి దక్కాల్సిన బహుమతి``, ``అంత అందమైన అమ్మాయిని దీదీ అని పిలిచినందుకు తల్లికి కోపం వచ్చింది``, ``ఇండియన్ అమ్మలు అలాగే ఉంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-10-02T14:56:57+05:30 IST