Viral Video: ఎవడ్రా నువ్వు.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు.. బ్లేడు కూడా అవసరం లేకుండా ఎంత నీట్‌గా పర్సు కొట్టేశాడో చూడండి..
ABN , First Publish Date - 2023-10-02T14:39:52+05:30 IST
షర్టుకు తెలియకుండా బనియను, ఫ్యాంట్‌కు తెలియకుండా పర్సు కొట్టేస్తాడు అంటూ సినిమాల్లో దొంగల ట్యాలెంట్‌ను వర్ణిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ వర్ణనలో ఏ మాత్రం అతిశయం లేదనిపిస్తుంది. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి ప్యాంట్ బ్యాక్ పాకెట్‌లోని పర్సును ఓ వ్యక్తి చాలా సునాయాశంగా కొట్టేశాడు.
షర్టుకు తెలియకుండా బనియను, ఫ్యాంట్‌కు తెలియకుండా పర్సు కొట్టేస్తాడు అంటూ సినిమాల్లో దొంగల ట్యాలెంట్‌ను వర్ణిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే ఆ వర్ణనలో ఏ మాత్రం అతిశయం లేదనిపిస్తుంది. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి ప్యాంట్ బ్యాక్ పాకెట్‌లోని పర్సును ఓ వ్యక్తి చాలా సునాయాశంగా కొట్టేశాడు (Pickpocket). ఆ బస్సు వెనుక కారులో ఉన్న వ్యక్తి ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Crime News).
uttarkarnataka.official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో జనం గుంపుగా బస్సు (Bus) ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ రద్దీలో ఒక జేబు దొంగ (Thief) తన ట్యాలెంట్ చూపించాడు. బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఓ ప్రయాణికుడి జేబులో చేయి పెట్టి అతని పర్సును (Stealing Purse) సైలెంట్‌గా తీసేశాడు. తన జేబులో వేరొక వ్యక్తి చేయి పెట్టినట్టు కూడా ప్రయాణికుడు గుర్తించలేకపోయాడు. అయితే ఆ బస్సు వెనుక ఉన్న కారులో కూర్చున్న వ్యక్తి ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు.
Viral Video: ఇదేం పిచ్చి సామీ.. పందితో కలిసి నూడిల్స్ తింటున్న యువకుడు.. కొత్త వైరస్ కోసం అంటూ కామెంట్లు..
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 1.7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇదొక రకం ట్యాలెంట్``, ``ఇది నిజమేనా? లేక రీల్ కోసం అలా నటించారా?``, ``వీడియో తీసిన వ్యక్తి ఆ దొంగను పట్టించాడా? లేదా?``, ``నేను ఇలా రద్దీగా ఉన్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించి రెండుసార్లు పర్సు పోగొట్టుకున్నా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.