ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Benefits of Tears: ఆడవాళ్లు ఏడిస్తే ప్రతిదానికి ఏడుస్తావ్ అంటారు..అదే మగవాళ్లు ఏడిస్తే..!

ABN, First Publish Date - 2023-03-30T11:19:05+05:30

నవ్వినా..ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఏ కన్నీటి వెనుక ఏముందో తెలుసుకో అని మనస్సు కవి ఆత్రేయ రాసిన పాటల్లో ఎంత అర్థం ఉందో అంత పరమార్థం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నవ్వినా..ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఏ కన్నీటి వెనుక ఏముందో తెలుసుకో అని మనస్సు కవి ఆత్రేయ రాసిన పాటల్లో ఎంత అర్థం ఉందో అంత పరమార్థం ఉంది. బాధ, నొప్పి, సంతోషం ఏదీ ఎక్కువైనా కన్నీళ్లు వస్తాయి. అలా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే.. చిన్న పిల్లల్లా(Like little children) ఏడవటం ఏంటని ఎగతాళి చేస్తుంటారు. కానీ ఆ ఏడుపు వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు ఏడుస్తే(women cry)..ప్రతిదానికి ఎందుకు ఏడుస్తావ్ అంటారు. విసుగుంటారు కూడా. అదే మగవాళ్లు ఏడిస్తే(men cry)..ఏంట్రా ఆడదానిలా ఏడుస్తావ్ అంటారు. అంటే భావోద్వేగాలు, ఆడవారికి, మగవారికీ ఒకేలా ఉంటాయి. కానీ ఆడవారు సున్నితమైన మనసులు కాబట్టి త్వరగా ఏడుస్తారు. కానీ మగవారికి బాధ వచ్చినా.. ఏడవటానికి సంకొచిస్తారు. వారు చులకన అవుతారేమోనని. కానీ ఏడవటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు(Health professionals). కన్నీళ్లలో ముఖ్యంగా మూడు రకాలు ఒకటి బాసల్ టియర్స్(Basal tears).. శుభ్రం చేసే కన్నీరు. నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల(microliters) వరకు ఉత్పత్తి అవుతాయట. ఇవి కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్ ఫెక్షన్ నుంచి కాపాడుతాయట. రెఫ్ లెక్ టియర్స్ కళక కన్నీరు. ఉల్లిపాయలు కొసినప్పుడు, కళ్లకు ఏదైనా తాకినప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఇవి కళ్లలో పడ్డ దుమ్ము బయటకు వచ్చేందుకు కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడుతాయి.

ఇక ఏమోషనల్ టియర్స్(Emotional tears).. భావోద్వేగ కన్నీరు. ఎక్కువగా బావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ల నుంచి నీరు ఊబికి వస్తుంటుంది. వీటి వల్ల మనిషికి ఒత్తిడి తగ్గుతుంది. మనిషి ఎక్కువ సంతోషం వచ్చినా..బాధ కలిగినా.. భయపడ్డా.. ఒత్తిడి పెరిగినా ఏడ్చేస్తారు. ఏలే యూనివర్సిటీకి(ELE University) చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్లు మనిషి భావోద్వేగాన్ని సమతుల్యం చేస్తాయని తేలింది. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు(Psychological pressures) తగ్గి..మనుసు కుదుటపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎక్కువ సేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్(Oxytocin), ఎండో జెన్నీస్ ఓబియడ్స్(Endo Jenny's Obeds) విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. దీంతో కాస్త చల్లబడి మౌనంగా ఉండిపోతారు. పిల్లలు ఏడుస్తూంటే కొన్నిసార్లు..ఏడవని తల్లిదండ్రులు ఊరుకుంటారు. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఆ నిద్ర ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. ఎక్కువ సేపు నిద్రపోగలరట.

ఓ సర్వే ప్రకారం ఏడ్చి మంచి నిద్ర పట్టడంతో పాటు.. లేచినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుందట. అంతేకాదు కన్నీటిలో హైసోజిమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనికి యాంటీ బయోగ్రామ్ లక్షణాలు ఉన్నాయి. దీంతో కళ్లలో బ్యాక్టీరియా(Bacteria) చేరితే ఐసోజిన్(Isogyne) వాటితో పోరాడి కళ్లకు హాని జరగకుండా చూసుకుంటుంది. ఎక్కువ సేపు ఏడవడం వల్ల శరీరంలో యాక్సిటోసిన్ ఏండోజెన్సిస్(Oxytocin endogenesis) విడుదలవుతాయి. ఇదీ శరీరంలోని ఒత్తిడి, హర్మోన్ల ఉత్పత్తి(Production of hormones) తగ్గిస్తుంది. అలాగే ఈ ఏడుపు వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. ఇదీ కంటికి తేమను ఇస్తుంది. ఏడుపు కళ్ల పొడితనాన్ని తగ్గిస్తోంది. ఏడుపు డిప్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Updated Date - 2023-03-30T11:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising