ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Allu Aravind: అక్కడ చోటు దక్కించుకోవడం చిన్న విషయం కాదు!

ABN, First Publish Date - 2023-02-17T15:26:24+05:30

‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ సినిమాకు కచ్చితంగా ఆస్కార్‌ వస్తుందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR- Oscar nominations) సినిమాకు కచ్చితంగా ఆస్కార్‌ వస్తుందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ (allu aravind comments on RRR) అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆస్కార్‌ నామినేషన్‌లో (Oscar nominations) చోటు దక్కించుకోవడమన్నది చిన్న విషయం కాదు. ఇది సినిమా పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహంలాంటిది అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధించిన ఘనతను భారతీయులంతా కలిసి సెలబ్రేట్‌ (RRR celebrations Time) చేసుకోవాలన్నారు.

ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ (Golden globe award) అవార్డు గెలుచుకుంది. ఆస్కార్‌ నామినేషన్‌లో కూడా స్థానం సంపాదించుకుంది. తప్పకుండా ఆస్కార్‌ కూడా గెలుచుకుంటుందనే నమ్మకం నాకుంది. ఆ అవార్డు రాజమౌళి సినిమాకు వచ్చిన గుర్తింపుగానే కాకుండా తెలుగు సినిమాకు, భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగానూ చూడాలి. మన దేశం నుంచి ఓ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరినందుకు మనమంతా గర్వించాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధిస్తున్న అరుదైన విజయాలను ఆస్వాదించాలని అల్లు అరవింద్‌ కోరారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉంది. మార్చి 13న జరగనున్న ఆస్కార్‌ వేడుక కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. భారతీయులంతా ఈ అవార్డ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు దక్కాలని కోరుకుంటున్నారు. రామ్‌ చరణ్‌, తారక్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించారు.

Updated Date - 2023-02-17T15:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising